Home » సల్మాన్ ఖాన్ తెలియదంటున్న పంజాబ్ బౌలర్..!

సల్మాన్ ఖాన్ తెలియదంటున్న పంజాబ్ బౌలర్..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 ప్రస్తుతం చాలా రసవత్తరంగా సాగుతుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా 8 జట్లు పోటీ పడుతూనే ఉన్నాయి. ఆందులో పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కటి. అయితే ఇప్పటివారకు ఆడిన 11 మ్యాచ్ లలో 5 విజయాలు నమోదు చేసి 10 పాయింట్లలో 8వ స్థానంలో ఉంది పంజాబ్. అయితే ఈ సీజన్ మొదట్లో పర్వాలేదు అనిపించిన తర్వాత కొన్ని వరుస ఓటములు రావడంతో పంజాబ్ కిందరు పడిపోయింది. ఇక చివరగా రాజస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో కూడా ఓడిపోయింది.

Advertisement

అయితే తాజాగా ఈ జట్టు బౌలర్లు కగిసో రబడా, ఓడియన్ స్మిత్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ రబడాను మీకు సల్మాన్ ఖాన్ తెలుసా.. అని ప్రశ్నించగా.. నాకు సల్మాన్ ఖాన్ ఎవరో తెలియదు.. రషీద్ ఖాన్ తెలుసు అని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఇక రబడా సమాధానం విన్న యాంకర్ కూడా తన నవ్వును ఆపుకోలేకపోయింది. అనంతరం రబడా, ఓడియన్ స్మిత్ ఇద్దరితో సల్మాన్ పాపులర్ డైలాగులు చెప్పించడానికి ప్రయత్నించింది. వారు కూడా కష్ట పడుతూ ఆ డైలాగులు చెప్పారు.

Advertisement

అయితే గత ఐపీఎల్ సీజన్ వరకు ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రబడాను ఐపీఎల్ 2022 కోసం జరిగిన మెగవేలంలో రూ.9.25 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగోలు చేసింది. ఇక తనకు దక్కిన ధరకు తగిన విధంగానే రబడా కూడా బాగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి పంజాబ్ జట్టులో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇక ఈ నెల 13న ప్లే ఆఫ్స్ కోసం ఎంతో ముఖ్యమైన మ్యాచ్ ను బెంగళూర్ జట్టుతో ఆడనుంది పంజాబ్ కింగ్స్. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

కెప్టెన్సీని కష్టాలో పడేసుకున్న శ్రేయాస్ అయ్యర్…!

వచ్చే ఏడాది ఐపీఎల్ అభిమానులకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ…!

Visitors Are Also Reading