Home » విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గా ఉండేందుకు రోజు ఏం తింటాడో తెలుసా ? అతనికి ఏ ఫుడ్ అంటే ఇష్టం !

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గా ఉండేందుకు రోజు ఏం తింటాడో తెలుసా ? అతనికి ఏ ఫుడ్ అంటే ఇష్టం !

by Bunty
Ad

టీమిండియా క్రికెట్ లో విరాట్ కోహ్లీది ఒక ప్రత్యేక స్థానం. అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియా కు తీసుకువచ్చి… ఆ తర్వాత మెయిన్ టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీకి అదృష్టం కలిసి వచ్చి ఒకేసారి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాలో మంచిగా సెటిల్ అవుతున్న సమయంలోనే… ధోని రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో విరాట్ కోహ్లీని టెస్ట్, వన్డే, టి20 లకు కెప్టెన్ ను చేసేసారు బీసీసీఐ పెద్దలు. ఇక అప్పటినుంచి టీమిండియా కు అనేక విజయాలను వంటి చేత్తో అందించాడు విరాట్ కోహ్లీ.

Advertisement

ఇక అటు మొన్నటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. అయితే దురదృష్టవశాత్తు… టీమిండియా కు మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలనుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఇప్పుడు నార్మల్ క్రికెటర్ గా జట్టులో కొనసాగుతున్నాడు కోహ్లీ. అయితే ఈ జర్నీలో కోహ్లీ అనేక సెంచరీలు, హాఫ్ సెంచరీలు మరియు చాలా క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడో ఇప్పుడు చూద్దాం. బ్రేక్ఫాస్ట్ సమయంలో విరాట్ కోహ్లీ… బాయిల్డ్ ఎగ్స్… అలాగే ఆమ్లెట్ కూడా తింటాడు.

Advertisement

అలాగే పపాయ, వాటర్ మిలన్ కూడా విరాట్ కోహ్లీ తింటాడు. బ్రేక్ఫాస్ట్ సమయంలో కచ్చితంగా రోజుకు మూడు కోడిగుడ్లు తింటాడు విరాట్ కోహ్లీ. అలాగే ఉదయం పూట గ్రీన్ టీ తాగుతాడు. ఒక రోజులో నాలుగు సార్లు గ్రీన్ టీ తాగుతాడు విరాట్ కోహ్లీ. ఇక లంచ్ సమయంలో… ఎక్కువగా వెజిటేబుల్స్, అలాగే మాంసం ఎక్కువగా తింటాడు విరాట్ కోహ్లీ. చికెన్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాడట కోహ్లీ. మాంసం తినడం కారణంగా మజిల్స్ పెరుగుతాయని నిపుణులు చెప్పడంతో విరాట్ కోహ్లీ ఆ డైట్ ఫాలో అవుతున్నాడు. ఇక డిన్నర్ సమయంలో.. సి ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఇక విరాట్ కోహ్లీ కి బట్టర్ చికెన్ అంటే బాగా ఇష్టం. అలాగే విరాట్ కోహ్లీ తాగే లీటర్ బాటిల్ 1000 కి పైగా ఉంటుందట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

Custody : నాగచైతన్య కస్టడీ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!

Visitors Are Also Reading