Home » మళ్ళీ కెప్టెన్సీ చేయనున విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా..? 

మళ్ళీ కెప్టెన్సీ చేయనున విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా..? 

by Azhar
Ad
విరాట్ కోహ్లీకి ఎంత మంది అభిమానులు ఉన్నారు అంటే వారికీ లెక్కించడం కష్టం అని చెప్పవచ్చు. అయితే 2017 లో భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా నియమితుడు అయిన విరాట్ కోహ్లీ గత ఏడాది మూడు ఫార్మట్స్ నుండి కెప్టెన్ గా తప్పుకున్నాడు. మొదట కోహ్లీ టీ20 ల నుండి తప్పుకోగా.. తర్వాత బీసీసీఐ వన్డే నుండి తప్పించింది. ఇక గత ఏడాది సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత కోహ్లీ టెస్టుల నుండి కూడా తప్పుడుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ కోహ్లీ కెప్టెన్సీ చేయనున్నట్లు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 1 నుండి ఆడాలి. ఇక పునరాస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరిస్తున్నాడు. కానీ నిన్న అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించినది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇంత తొందరగా రోహిత్ శర్మ కరోనా నుండి కోలుకొని జట్టులోకి రావడం అనేది జరగని పని. అందుకే ఈ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్సీ ఎవరు చేయనున్నారు అనే ప్రశ్న వస్తుంది.
ఇందుకు సమాధానం విరాట్ కోహ్లీ. అయితే చాల మంది రిషబ్ పంత్ పేరు అలాగే బుమ్రా పేరు వినిపిస్తున్నారు. కానీ బుమ్రాకు ఇప్పటివరకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. ఇక పంత్ ఎలాంటి కెప్టెన్ అనేది సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో చూసాం. అందువల్ల ఈ మ్యాచ్ లో కెప్టెన్సీని కోహ్లీకే ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటుంది. ఇందుకు ఇంకో కారణం కూడా ఉంది. ఈ మ్యాచ్ గత ఏడాది జరగాల్సింది. కానీ అప్పుడు 5 టెస్టుల సిరీస్ లో నాలుగు జరిగిన తర్వాత కరోనా కేసులు రావడంతో ఆఖరి టెస్ట్ వాయిదా పడి ఇప్పుడు జరుగుతుంది. అయితే గత ఏడాది జరిగిన నాలుగు మ్యాచ్ లకు కోహ్లీనే కెప్టెన్సీ వహించాడు. అందుకే ఆ సిరీస్ లోని మ్యాచ్ కావడంతో దీనికి కూడా కోహ్లీనే కెప్టెన్సీ చేయలని అందరూ భావిస్తున్నారు. కానీ కోహ్లీ అందుకు ఒప్పుకుంటాడా.. లేదా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading