Home » ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో కరోనా కేసులు… టెస్ట్ మ్యాచ్ జరిగేనా…?

ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో కరోనా కేసులు… టెస్ట్ మ్యాచ్ జరిగేనా…?

by Azhar

భారత జట్టు ఒక్కటి ఐర్లాండ్ లో ఉండగా.. మరొకటి ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రెండు పర్యటనల్లో ఐర్లాండ్ కంటే ఇంగ్లాండ్ లో ఉన్న జట్టుపైనే అందరి దృష్టి అనేది ఉంది. ఎందుకంటే ఈ జట్టులోనే భారత ముఖ్యమైన ఆటగాళ్లు అందరూ ఉన్నారు. అది పక్కకు పెడితే… ఈ పర్యటనల్లో మన జట్టు ఇంగ్లాండ్ తో వోక్స్ టెస్ట్ మ్యాచ్ తో పాటుగా వన్డే సిరీస్, టీ20 సిరీస్ లో కూడా పాల్గొనబోతుంది. వచ్చే నెల 1వ తేదీన మొదట ఈ రెండు జట్లు టెస్ట్ మ్యాచ్ లో పాల్గొంటాయి. ఆ ఆతర్వాత వైట్ బాల్ సిరీస్ లో ఆడుతాయి. కానీ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ అనేది జరుగుతుందా.. లేదా అనేది ప్రశ్నగా మారింది.

ఎందుకంటే ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో కరోనా కేసులు అనేటివి వెలుగు చుస్తున్నాయి. అయితే మన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. నిన్న చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఈరోజు ఉదయం ప్రకటించింది. ఇక ఈ వార్త తర్వాత మన కెప్టెన్ ఈ మ్యాచ్ లో ఎవరు ఉంటారు అనే చర్చ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ జరుగుతున్న సమయంలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు స్వయంగా తెలిపింది. దాంతో ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఉంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ గత ఏడాది జరగాల్సింది. కానీ అప్పుడు మన భారత జట్టులో కరోనా కేసులు రావడంతో ఈ ఆఖరి టెస్ట్ రద్దు అయ్యింది. దానిని ఇప్పుడు రీషెడ్యూల్ చేయగా… మళ్ళీ కరోనా అనేది వచ్చింది. కానీ ఇప్పుడు రెండు జట్లలో కేసులు అనేవి వెలుగు చూశాయి. అందువల్ల మళ్ళీ ఈ మ్యాచ్ వాయిదా పడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

జడేజాను మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ మాజీ కామెంటేటర్..!

సన్ రైజర్స్ ఆటగాళ్ల అరంగేట్రంపై కెప్టెన్ పాండ్య హింట్..!

Visitors Are Also Reading