Home » Anand Mahindra: ఆ వ్యక్తిని చూసి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన రియాక్షన్ చూస్తే నవ్వాగదు..! ఏమన్నారంటే?

Anand Mahindra: ఆ వ్యక్తిని చూసి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన రియాక్షన్ చూస్తే నవ్వాగదు..! ఏమన్నారంటే?

by Srilakshmi Bharathi
Ad

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మంగళవారం X లో తనను పోలిన వ్యక్తి యొక్క పోస్ట్‌పై స్పందించారు. ఆ స్పందన ఇప్పుడు వైరల్ గా మారింది. “మా చిన్నతనంలో మేం ఏదో మేళా సమయంలో విడిపోయినట్లు కనిపిస్తోంది,” అంటూ @pjdaddyofficial పేరుతో ఉన్న యూజర్ పోస్ట్ పై మహీంద్రా స్పందించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ యూజర్ పూణే లోని తన కొలీగ్ ఫోటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆ వ్యక్తి అచ్చం మహీంద్రా లానే ఉండడంతో ఈ ఫోటో వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఫోటోను చూసిన మహీంద్రా చిన్నప్పుడు ఏదో మేళాలో తప్పిపోయినట్లు ఉన్నాం అంటూ సరదాగా కామెంట్ చేసారు.

Advertisement

Advertisement

“@anandmahindra ఈ వ్యక్తిని చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. పూణేకి చెందిన నా సహోద్యోగి, ఆనంద్ మహీంద్రా లాగా కనిపిస్తారు,” అని యూజర్ తాను పోస్ట్ చేసిన ఫోటో పాటు రాసుకొచ్చారు. చాలా మంది X వినియోగదారులు ఆ రెండు ఫోటోల మధ్య ఉన్న సిమిలారిటీస్ ను చూపిస్తూ వస్తున్నారు. రెండు ఫోటోలలో ఉన్న పోలికలను చూపిస్తున్నారు. కొందరేమో ఆయన కచ్చితంగా మీ ట్విన్ అయ్యుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మీకు తెలియని ఫామిలీ మెంబెర్స్ ఎవరైనా ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

“అతను కోర్టుకు వెళితే, అతను మీ సోదరుడు కాదని మీరు నిరూపించాలి” అని ఒక యూజర్ సరదాగా కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటారు. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు. ఇక సెలెబ్రిటీలను పోలిన మనుషులు కనిపిస్తే.. వారిని కచ్చితంగా అందరూ హైలైట్ చేస్తూ ఉంటారు. వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading