Home » విజ‌య‌శాంతి, సాయిప‌ల్ల‌వికి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటంటే..?

విజ‌య‌శాంతి, సాయిప‌ల్ల‌వికి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటంటే..?

by Anji
Ad

టాలీవుడ్ హీరో ద‌గ్గుబాటి రానా, హీరోయిన్ గా న‌టించిన సినిమా విరాట‌ప‌ర్వం చిత్రం జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినీ విశ్లేష‌కులు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సినిమాతో రానా, సాయిప‌ల్ల‌వి ఖాతాల్లో స‌క్సెస్ సాధించిన‌ట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాకు సాయిప‌ల్ల‌వి మీద ఉన్న‌క్రేజ్‌తోనే చాలా మంది థియేట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లి సినిమాను వీక్షించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిప‌ల్ల‌విని లేడీ ప‌వ‌ర్ స్టార్ అని సంబోధించ‌డం మ‌రొక విశేషం.


ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి ఏవిధంగా క్రేజ్ ఉందో అప్ప‌ట్లో విజ‌య‌శాంతికి కూడా అలాగే ఉండేది. విజ‌య‌శాంతిని కూడా లేడీ సూప‌ర్ స్టార్ అని పిలిచేవార‌ట‌. అప్పుడు సాయి ప‌ల్ల‌విని కూడా అలాగే సంబోదిస్తుంటారు. సాయిప‌ల్ల‌వికి ముందు త‌రువాత చాలా మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఈమె అంత క్రేజ్ ఏ హీరోయిన్‌కు రాలేదు. ఇక విరాట ప‌ర్వం సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.14 కోట్లు జ‌రిగింది. ఇక ఈ సినిమా స‌క్సెస్ సాధిస్తే సాయిప‌ల్ల‌వికి చాలా ఇండ‌స్ట్రీలో సినిమా ఆఫ‌ర్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Advertisement

Advertisement

సాయిప‌ల్ల‌వికి పెద్ద పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రాన‌ప్ప‌టికీ ఈ స్థాయిలో పాపులారీటిని సంపాదించుకోవ‌డం మాత్రం సాయిప‌ల్ల‌వికే సాధ్య‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. ఈమె త‌న ఒక్క సినిమాకు రెండు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నది. ఆమెకు ఉన్న క్రేజ్ తో భ‌విష్య‌త్‌లో ఇంకా రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటుందో లేదో చూడాలి. ఇక హీరోయిన్ సాయిప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్ చూస్తే స్టార్ హీరోలు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొత్తానికి అప్ప‌ట్లో విజ‌య‌శాంతికి ఉన్న క్రేజ్ ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి ద‌క్కింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Also Read : 

ఫాద‌ర్స్ డే ఎందుకు జ‌రుపుకుంటారు..? ఇది ఎప్పుడు ప్రారంభ‌మైందో తెలుసా..?

జియో యూజ‌ర్ల‌కు షాక్‌.. మీరు జియో క‌స్ట‌మ‌ర్ అయితే ఈ విష‌యాన్ని త‌ప్ప‌కుండా తెలుసుకోండి

Visitors Are Also Reading