Home » ఫాద‌ర్స్ డే ఎందుకు జ‌రుపుకుంటారు..? ఇది ఎప్పుడు ప్రారంభ‌మైందో తెలుసా..?

ఫాద‌ర్స్ డే ఎందుకు జ‌రుపుకుంటారు..? ఇది ఎప్పుడు ప్రారంభ‌మైందో తెలుసా..?

by Anji

తండ్రి ఎవ‌రి ఇంట్లో అయినా ముఖ్య‌మైన సభ్యుడు. ఆయ‌న నీడ‌లో కుటుంబం సుర‌క్షితంగా ఉంటుంది. కుటుంబ పోష‌ణ‌కు, కుటుంబ స‌భ్యుల‌కు సంతోషంగా ఉంచేందుకు ప‌గలు, రాత్రి క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాడు. తండ్రి అంద‌రినీ ప్రేమిస్తుంటాడు. త‌న భావాల‌ను ఎవ‌రితో కూడా పంచుకోడు. తండ్రి చేసిన అవిశ్రాంత ప్ర‌య‌త్నాల ప‌ట్ల మ‌న భావాల‌ను వ్య‌క్త ప‌ర‌చ‌డానికి ఫాద‌ర్స్ డే వేడుక జ‌రుపుకుంటారు. ప్ర‌తి ఏడాది జూన్ మూడ‌వ ఆదివారం రోజు ఫాద‌ర్స్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకుంటాం. ఈ ఏడాది ప్ర‌త్యేక రోజు జూన్ 19న జ‌రుపుకుంటారు. తండ్రి త్యాగం, ప్రేమ‌, బాధ్య‌త ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసేందుకు జీవితమంతా చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ తండ్రి ప‌ట్ల మ‌నకు ఉన్న ప్రేమ‌, గౌర‌వం, భావాల‌ను వ్య‌క్తీక‌రించ‌డానికి ఫాద‌ర్స్ డే వేడుక చేసుకోవ‌డం కీల‌కం. ఈ వేడుక ఎప్పుడు ప్రారంభ‌మైంతో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మొదటిసారిగా ఈ ఫాదర్స్ డే వాషింగ్టన్‌లోని స్పోకేన్ నగరం నుండి ప్రారంభించినట్లు చెబుతారు. ఈ రోజును సోనోరా స్మార్ట్ డాడ్ మొదటిసారిగా జరుపుకుంది. వాస్తవానికి సోనోరాకు తల్లి లేదు. ఆమె తండ్రి ఆమెతోపాటు మరో ఐదుగురు తోబుట్టువులకు తల్లిదండ్రుల ప్రేమను పంచి వారిని పెండాడు. తన తండ్రి ప్రేమ, త్యాగం, అంకితభావాన్ని చూసిన సోనోరా.. ‘మదర్స్‌ డే’ని మాతృత్వానికి అంకితం చేసినప్పుడు, తండ్రి ప్రేమ, ఆప్యాయతలకు గుర్తుగా ‘ఫాదర్స్‌ డే’ని కూడా జరుపుకోవచ్చని భావించింది.

 


సంవత్స‌రంలో క‌నీసం ఒక్క‌సారి అయినా తండ్రి పేరు మీద ఉండాలని.. సోనోరా తండ్రి పుట్టిన రోజు జూన్‌లో ఉంది. జూన్‌లో ఫాద‌ర్స్ డే వేడుక జ‌రుపుకోవాల‌ని ఆమె పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ వేడుక‌ను జ‌రుపుకునేందుకు త‌న పిటిష‌న్‌ను విజ‌యవంతం చేయ‌డానికి ఆమె యూఎస్‌లో శిబిరాల‌ను ఏర్పాటు చేసారు. చివ‌రికి వారి డిమాండ్ నెర‌వేరింది. 1910 జూన్ 19న తొలిసారిగా ఫాద‌ర్స్ డే వేడుక జ‌రుపుకున్నారు.


అయితే 1916లో యూఎస్ అధ్య‌క్షుడు ఉడ్రో విల్స‌న్ ఫాద‌ర్స్ డే వేడుక‌ను జ‌రుపుకునే ప్ర‌తిపాద‌నను అంగీక‌రించాడు. ఆ త‌రువాత 1924లో అప్ప‌టి అధ్య‌క్షుడు కాల్విన్ కూలిడ్జ్ ఫాద‌ర్స్ డే వేడుక‌ను జాతీయ కార్య‌క్ర‌మంగా ప్ర‌క‌టించారు. 1966వ సంవ‌త్స‌రంలో అధ్య‌క్షుడు లిండ‌న్ జాన్స‌న్ జూన్ మూడ‌వ ఆదివారం ఫాద‌ర్స్ డే వేడుక‌ను జ‌రుపుకోవాల‌ని ప్ర‌క‌టించారు. ఇక 1972లో ఈ రోజును అధ్యక్షుడు రిచ‌ర్డ్ నిక్స‌న్ సెల‌వు దినంగా ప్ర‌క‌టించారు. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 3వ ఆదివారం ఫాద‌ర్స్ డే వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు.  ఇక ఆల‌స్యం ఎందుకు మీరు కూడా ఈ జూన్ 19న ఫాద‌ర్స్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకోండి.

Also Read : 

చిరంజీవి శ్రీదేవి కాంబోలో వచ్చిన “వజ్రాల దొంగ” సినిమా ఎందుకు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..?

ప‌ళ్లు పుచ్చిపోవ‌డం వ‌ల్ల నొప్పిగా ఉందా..? ఇలా చేస్తే వెంట‌నే త‌గ్గుతుంద‌ట‌..!

 

Visitors Are Also Reading