Home » జియో యూజ‌ర్ల‌కు షాక్‌.. మీరు జియో క‌స్ట‌మ‌ర్ అయితే ఈ విష‌యాన్ని త‌ప్ప‌కుండా తెలుసుకోండి

జియో యూజ‌ర్ల‌కు షాక్‌.. మీరు జియో క‌స్ట‌మ‌ర్ అయితే ఈ విష‌యాన్ని త‌ప్ప‌కుండా తెలుసుకోండి

by Anji
Ad

జియోఫోన్ ప్ర‌వేశ‌పెట్టి ప్రారంభంలో క‌స్ట‌మ‌ర్ల‌ను ఎంతో ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం చాలా మంది జియో క‌స్ట‌మ‌ర్లు వేరే నెట్‌వ‌ర్క్‌కు క‌న్వ‌ర్ట్ అవుతున్నారు. ఈ త‌రుణంలో కూడా జియో మ‌ళ్లీ క‌స్ట‌మ‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా జియోఫోన్ నెక్ట్స్ ప్రీపెయిడ్ ప్రారంభ రీఛార్జీ ప్లాన్‌ల‌పై 20 శాతం ధ‌ర‌ల‌ను పెంచింది. అయితే ప్రారంభ రీఛార్జ్ ప్లాన్‌లు గ‌తంలో రూ.155, రూ185, రూ.749 ఉండేవి. రూ.155 రీఛార్జ్ ప్లాన్‌ను రూ.186కి, రూ.185 ప్లాన్ రూ.222కి, రూ.749 ప్లాన్ ను ఏకంగా రూ.899 కి పెంచారు. ఇక ఈ మూడు ధ‌ర‌ల‌ను పెంచిన‌ట్టు జియో త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న‌ట్టు నివేదిక‌లు వెల్ల‌డించాయి.

Advertisement

జియో ఫోన్ నెక్ట్స్ ప్లాన్‌లు..

రిల‌య‌న్స్ జియో ఫోన్ నెక్ట్స్ పేరుతో కొనుగోలు దారుల‌కు బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫీచ‌ర్ ఫోన్ అందిస్తున్న విష‌యం విధిత‌మే. జియో సంస్థ ఆ ఫోన్ కు ప్ర‌త్యేక‌మైన వివిధ టారిప్ ధ‌ర‌ల‌ను అందిస్తోంది. ఇప్పుడు ఆ ధ‌ర‌లను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. జియో ఫోన్ నెక్ట్స్ యూజ‌ర్ల‌కు అందిస్తున్న రూ.186 బేసిక్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటితో ప్ర‌తిరోజు 1 జీబీ డేటాను అందిస్తుంది. వాయిస్ కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవ‌చ్చు.

Advertisement

రూ.222 ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటితో ఈ ప్లాన్‌లో యూజ‌ర్లు డైలీ ఇంట‌ర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌తో 2 జీబీ డేటాను వినియోగించుకోవ‌చ్చు. అదేవిధంగా అన్ లిమిటేడ్ వాయిస్ కాల్స్ 100 ఎస్ఎంఎస్ సెండ్ చేసుకోవ‌చ్చు.

రూ.899 ప్లాన్  :  336 రోజుల వ్యాలిడిటితో 24 జీబీ డేటాను పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటితో ప్ర‌తి రోజు 2 జీబీ డేటాను వినియోగించుకోవ‌చ్చు. ఇక వ్యాలిడిటి పూర్త‌యితే రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తి రోజు 50 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వాయిస్ కాల్స్ ను కూడా చేసుకోవ‌చ్చు. జియో ఇలా ధ‌ర‌ల‌ను పెంచ‌డాన్ని ప‌లువురు క‌స్ట‌మ‌ర్లు మండిప‌డుతున్నారు.

Also Read : 

క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇటువంటి క్యాచ్ చూడ‌లేదు.. చూస్తే వావ్ అనాల్సిందే..!

మ‌నం పిచ్చి మొక్క అనుకునే ఈ మొక్క వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading