Home » వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కి కీల‌క బాధ్య‌త‌లు

వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కి కీల‌క బాధ్య‌త‌లు

by Anji
Published: Last Updated on
Ad

వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అయితే వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జిగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు ట్విట్టర్ ర్ వేదికగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి తీవ్రంగా ఎంతో కృషి చేశారు. సీఎం జగన్ నేరుగా ప్రజల్లో ఉంటే క్షేత్ర స్థాయి వ్యూహాల్లో కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి. ప్రశాంత్ కిషోర్ టీమ్ చెప్పిన ప్లాన్ పక్కాఆ అమలు అయ్యేలా చూసే బాధ్యత కూడా విజయసాయిరెడ్డిదే అని ప్రచారం సాగింది. అటు చంద్రబాబు, లోకేష్‌ను నిత్యం ట్విట్టర్ ద్వారా విమర్శించడం కూడా ఆయన వ్యూహాల్లోనే భాగమని తెలుస్తోంది. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి, జగన్ మధ్య గ్యాప్ వచ్చిన‌దని తీవ్ర ప్రచారం సాగింది. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను సీఎం జగన్ అప్పగించడంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందని చెప్పొచ్చు.

Visitors Are Also Reading