Telugu News » Blog » అల్లు రామలింగయ్యను సెట్స్ నుండి మెడలు పట్టి బయటకు గెంటేసిన విజయనిర్మల.. ఎందుకంటే..?

అల్లు రామలింగయ్యను సెట్స్ నుండి మెడలు పట్టి బయటకు గెంటేసిన విజయనిర్మల.. ఎందుకంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా.. నిర్మాతగా.. దర్శకురాలిగా.. ఆమె చేయలేని పని అంటూ లేదు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి బాలనాటిగా ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు విజయనిర్మల. 200 చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన విజయనిర్మల దాదాపుగా 45 సినిమాలకు దర్శకత్వం వహించింది. ఇంతటి టాలెంటట్ ఉన్న నటి 2019లో గుండెపోటు వల్ల మరణించడంతో యావత్తు సినీ లోకమంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ఆమె మరణించినప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎంతో మనోవేదనకు గురయ్యారు.

Advertisement

ఎంతో స్ట్రాంగ్ గా ఉండే కృష్ణ ఆమె మరణించిన తర్వాత వెక్కి వెక్కి ఏడవడం అదే మొదటిసారి. ఆయన ఏడుస్తుంటే అభిమానులు కూడా కన్నీరు కార్చారు. అలాంటి విజయనిర్మల కృష్ణతో కలిసి ఎన్నో స్పెషల్ ఇంటర్వ్యూ లు ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలలో యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు ముక్కు సూటిగా సమాధానం చెప్పేవారట. అయితే యాంకర్ మీరు దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఏ నటీనటులతో అయినా ఇబ్బంది పడి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. దానికి విజయనిర్మల సమాధానం ఇచ్చింది. ఓసారి కోట శ్రీనివాసరావు గారితో కాస్త ఇబ్బంది ఏర్పడింది.అంతేకాకుండా ఓసారి అల్లు రామలింగయ్య గారి వల్ల చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది.

Advertisement

Advertisement

షూటింగ్ రోజు ఆయన బాగా తాగేసి వచ్చారు. నేను సీన్ పేపర్స్ అందించి సన్నివేశాలను వివరిస్తుంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు. తాగిన మైకంలో ఉన్నాడు కాబట్టి ఏమీ అర్థం కావడం లేదు. ఈ తరుణంలో నాకు కోపం వచ్చి సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోండి అంటూ గట్టిగా అరిచాను. ఈరోజు మీతో సీన్ చెయ్యను అంటూ సెట్ నుండి ఆయనను బయటకు పంపించేసాను. మరుసటి రోజు ఆయన సెట్స్ కి వచ్చిన తర్వాత మరోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చానని విజయనిర్మల తెలియజేసింది. ఇక అప్పటి నుంచి రామలింగయ్య గారు ఎప్పుడు కూడా తాగి రాలేదని అన్నది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

 

You may also like