Home » చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన రామ్ చరణ్.. ఏ సినిమానో తెలుసా ?

చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన రామ్ చరణ్.. ఏ సినిమానో తెలుసా ?

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో హీరోగా తెరంట్రం చేసిన చెర్రీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా మగధీర సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చరణ్..  తన నటనతో ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చరణ్. ఈ మూవీతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Advertisement

అయితే హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్ చరణ్.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఓ సినిమాలో కనిపించారట. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే చరణ్ బాలనటుడిగా ఓ సినిమాలో నటించారట. చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ఉండే చరణ్.. అప్పుడే వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఆయన నటించిన సినిమాలోని చరణ్ సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందట. చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో చరణ్ ఓ సన్నివేశంలో నటించారట.

Advertisement

తండ్రి తో పాటు ఉన్న వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే సినిమా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చరణ్ సన్నివేశాలు సినిమాకు అతికించినట్లుగా ఉండడంతో తొలగించారట. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా.. రాజ్ కోటి సంగీతం అందించారు. ఇందులో రాధ, రేవతి, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ కీలకపాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  : 

టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఎలా ఉందంటే ?

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

Visitors Are Also Reading