Telugu News » Blog » ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

by Anji
Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిపురుష్ కి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హన్మంతుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించడం జరిగింది. రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.500కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. తాజాగా విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలని భారీగా పెంచేసింది.

Advertisement

అంతకుముందు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్ విజువల్స్ అంతగా ఆకట్టుకోకపోవడంతో మూవీ టీమ్  మళ్లీ రీ షూట్ చేయడమే కాదు.. గ్రాఫిక్స్ పైన బాగా శ్రద్ధ పెట్టడంతో సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది.  ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఆదిపురుష్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ని అలాగే ఈవెంట్ వేదిక స్థలాన్ని ఖరారు చేశారు. 

Advertisement

ఆదిపురుష్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 06న తిరుపతిలో గ్రాండ్ గా జరుపునున్నామని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్,నటీనటులు మాత్రమే కాదు.. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరవుతున్నారు. ఇప్పటికే పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్న సినిమా టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మరింత హైప్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Ramabanam OTT : రామబాణం ఓటిటి డేట్ ఫిక్స్…. ఎప్పటినుంచి అంటే

Advertisement

బోయపాటి-రామ్ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుందా ?

You may also like