Home » ఉప రాష్ట్రప‌తి వేత‌నం ఎంత‌..? ఎలాంటి స‌దుపాయాలుంటాయో మీకు తెలుసా..?

ఉప రాష్ట్రప‌తి వేత‌నం ఎంత‌..? ఎలాంటి స‌దుపాయాలుంటాయో మీకు తెలుసా..?

by Anji
Published: Last Updated on

ఈ నెల 10వ తేదీతో భార‌త ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. ఆ వెంట‌నే నూత‌న ఉప‌రాష్ట్రప‌తి అయిన‌టువంటి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేసి బాధ్య‌త‌ల‌ను అందుకుంటారు. ఈ మేర‌కు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఆయ‌న ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌దీప్ 528 ఓట్లు సాధించ‌గా.. యూపీఏ అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాకు 182 ఓట్లు పోల‌య్యాయి. ఒక వ్య‌క్తి ఉప‌రాష్ట్రప‌తి కావాలంటే ముందుగా భార‌తీయుడు అయి ఉండాలి. 35 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. 35 ఏళ్లునిండి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక కావ‌డానికి అర్హ‌త క‌లిగి ఉంటే మాత్ర‌మే ఉప‌రాష్ట్రప‌తిగా ఎన్నుకోబ‌డుతారు.

ఇక ఆ స‌ద‌రు వ్య‌క్తి భార‌త ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వం లేదా ఏదైనా లాభ‌దాయ‌కమైన ప‌ద‌విని క‌లిగి ఉంటే కూడా అన‌ర్హుడుపార్ల‌మెంట్ అధికారుల జీతాలు, అల‌వెన్స్‌ల చ‌ట్టం 1953 ప్ర‌కారం.. దేశంలోని ఉప‌రాష్ట్రప‌తి జీతాన్ని నిర్ణ‌యిస్తారు. ఎవ‌రు అయితే ఉప‌రాష్ట్రప‌తిగా ఉంటారో వాళ్లు రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా కూడా ఉంటారు. దీంతో ఆ స్థాయిలోనే జీతం, ప్ర‌యోజ‌నాల‌ను అందుకుంటారు. పార్ల‌మెంట్ నివేదిక ప్ర‌కారం.. ఉప‌రాష్ట్రప‌తికి నెల‌వారి వేత‌నంగా రూ.4ల‌క్ష‌లు అందిస్తారు. అంతేకాదు.. ర‌క‌ర‌కాల అల‌వెన్స్‌లు కూడా అంద‌జేస్తారు. గ‌తంలో ఉప‌రాష్ట్రప‌తికి నెల‌కు రూ.1.25ల‌క్ష‌ల వేత‌నం ఉండ‌గా.. 2018 బ‌డ్జెట్‌లో దీనిని రూ.4ల‌క్ష‌ల‌కు పెంచారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని మౌలానా ఆజాద్ రోడ్డులో ఉప‌రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఉంది. ఈ భ‌వ‌నం 6.48 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ భ‌వ‌నంలోనే ఉప‌రాష్ట్రప‌తి నివ‌సిస్తారు.

ఉప రాష్ట్రప‌తికి వేత‌నంతో పాటు ఉచిత వైద్యం, రైళ్లు, విమానాల్లో ఉచిత ప్ర‌యాణాలు వంటి ఇత‌ర స‌దుపాయాలు అందుతాయి. అంతేకాదు.. ఉచిత ల్యాండ్‌లైన్‌, మొబైల్ ఫోన్ క‌నెక్ష‌న్లు ఇస్తారు. వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌, సిబ్బందిని ప్ర‌భుత్వ‌మే నియ‌మిస్తుంది. ఒక‌వేళ ఏదైనా కార‌ణాల‌తో రాష్ట్రప‌తి బాధ్య‌త‌లు నిర్వ‌హించాల్సి వ‌స్తే.. అప్పుడూ రాష్ట్రప‌తికి అందే వేత‌నం, ఇత‌ర స‌దుపాయాల ల‌భిస్తాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఉప‌రాష్ట్రప‌తికి త‌మ వేత‌నంతో 50 శాతం పింఛ‌న్‌గా ల‌భిస్తుంది. దీంతో పాటు ఇత‌ర స‌దుపాయాలు కూడా కొన‌సాగుతాయి. నూత‌న ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ కు ప్ర‌ధాని మోడీ, ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Also Read : 

SR ఎన్టీఆర్ నిర్మాతగా మారడానికి కారణం ఎవరో తెలుసా…?

నాగ‌చైత‌న్య ఆ సినిమాకు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

Visitors Are Also Reading