Home » సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

by Anji
Ad

బాలీవుడ్ లో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గురువారం తెల్లవారుజామన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 66 ఏళ్ల వయసులో ఆయన ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్ చేసి ఆయన మృతి చెందినట్టు తెలిపారు. సతీష్ కౌశిక్ కి నివాళులర్పించారు.  మరణం ఈ ప్రపంచంలోని చివరి సత్యం అని నాకు తెలుసని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేసారు. బతికి ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చారు.

Also Read :  ఓటీటీలోకి అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisement

దాదాపు 45 ఏళ్ల స్నేహానికి ఇంత సడన్ గా పుల్ స్టాప్ పడుతుందని అస్సలు ఊహించలేదని.. ఓం శాంతి అని ట్వీట్ చేశారు. అంతకు ముందు సతీష్ కౌశిక్ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సతీష్ కౌశిక్ 1956 ఏప్రిల్ 13న హర్యానాలోని మహేంద్రగఢ్ జన్మించాడు. 1983లో వచ్చిన మసూమ్ సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించాడు. ఇప్పటివరకు దాదాపు 100 సినిమాలకు పని చేసాడు. అతను 1990లో రామ్ లఖన్, 1997లో సాజన్ చలే ససురాల్ కోసం ఫిల్మ్ పేర్ అవార్డు గెలుచుకున్నాడు. హిందీ నాటకం సేల్స్ మేన్ రాంరాల్ లో థియేటర్ నటుడిగా అతని అత్యంత ప్రసిద్ధ పాత్ర. దర్శకుడిగా అతని తొలి చిత్రం రూప్ కి రాణి చోరోన్ కా రాజా (1993), శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించింది.

Advertisement

Also Read :  చిరంజీవి రిక్షావోడు సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Manam News

దర్శకుడిగా అతని తొలి హిట్ చిత్రం 1999లో విడుదలైన హమ్ ఆప్ కే దిల్ మే రెహతే హై. 2005లో అర్జున్ రాంపాల్, అమిషా పటేల్, జాయెద్ ఖాన్ నటించిన వడ చిత్రానికి కౌశిక్ దర్శకత్వం వహించాడు. 2007లో కౌశిక్.. అనుపమ్ ఖేర్ తో కలిసి కరోల్ బాగ్ ప్రొడక్షన్ అనే కొత్త సినిమా కంపెనీని ప్రారంభించారు. ఈ బ్యానర్ లో అతని మొదటి చిత్రం సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన మూవీ తేరె సాంగ్. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సతీష్ కౌశిక్ పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

Also Read :  అన్నగారు ఒక్కో యాడ్ లో న‌టించేందుకు ఎంత తీసుకునేవారో తెలుసా.? అప్ప‌ట్లో ఆయ‌నే తోపు.!

Visitors Are Also Reading