Home » నాగార్జున చెప్పడంతోనే త‌న‌ని ఆ సినిమా నుంచి తొల‌గించారంటున్న హీరో వేణు తొట్టెంపూడి..!

నాగార్జున చెప్పడంతోనే త‌న‌ని ఆ సినిమా నుంచి తొల‌గించారంటున్న హీరో వేణు తొట్టెంపూడి..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ న‌టుడు వేణు తొట్టెంపూడి గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఆయ‌న స్వ‌యంవ‌రం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌న తొలి సినిమాతోనే విజ‌యాన్ని ద‌క్కించుకున్నారు. ఇక మొద‌టి సినిమాతోనే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు వేణు. ఇక ఆ త‌రుఆత చిరున‌వ్వుతో.. , హ‌నుమాన్ జంక్ష‌న్ ల‌తో పాటు త‌దిత‌ర సినిమాల్లో నటించి త‌న‌కంటూ కొంత మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఇత‌ని సినిమాలు చూసేందుకు చాలా ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. ఇక వ‌రుస ప‌రాజ‌యాల‌తో 2013లో రామాచారి సినిమాలో న‌టించి ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి అమెరికాలో స్థిర‌ప‌డ్డారు వేణు.

Advertisement

ఇటీవ‌ల వేణు తొట్టెంపూడి ర‌వితేజ హీరోగా న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వేణు త‌న కెరీర్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. స్నేహ‌మంటే ఇదేరా సినిమాతో త‌న‌కు జ‌రిగిన అనుభ‌వాన్ని పంచుకున్నారు. సూప‌ర్ గుడ్ ఫిలిం బ్యాన‌ర్‌లో ఆర్.బి.చౌద‌రి నిర్మించిన స్నేహ‌మంటే ఇదేరా సినిమాను తెర‌కెక్కించాల‌నుకున్న‌ప్పుడు తొలుత సుమంత్ క్యారెక్ట‌ర్‌లో త‌నను సంప్ర‌దించారు. ఆ త‌రువాత ఏమైందో ఏమో తెలియ‌దు రేపు సినిమా షూటింగ్ ఓపెనింగ్ అనుకున్న‌ప్పుడు త‌న‌ను పిలిచి నాగార్జున ఏవేవో కార‌ణాలు చెప్పి సినిమాని వ‌ద్ద‌న్నార‌ని వెల్ల‌డించారు. ఇక నాగార్జున అలా ఎందుకు చేశారో త‌న‌కు అర్థం కాక ఆ సినిమాను వ‌దిలేశాన‌ని చెప్పుకొచ్చారు వేణు. తీరా ఆ సినిమా విడుద‌లైన త‌రువాత చూస్తే ఆ పాత్ర‌లో సుమంత్ న‌టించారని తెలిపారు.

Advertisement

తొలుత నాగార్జున గారితో సినిమా అన‌గా నేను చాలా సంతోష‌ప‌డ్డాను. నాకు పెద్ద హీరోల‌తో క‌లిసి సినిమాల్లో క‌లిసి న‌టించాల‌నే కోరిక ఉండేది.ఆ అవ‌కాశం రాగానే ఒక పెద్ద హీరోతో న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ని సంబుర‌ప‌డ్డాను. కానీ కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ నాకు అలా జ‌ర‌గలేదు. నా సంతోషం ఎంత సేపు ఉండ‌లేదు అప్పుడు. ఇప్ప‌టికీ అలాంటి బాధ త‌న‌ని వేధిస్తోంది. 2012లో వ‌చ్చిన ఎన్టీఆర్ ద‌మ్ము సినిమాలో కూడా త‌న క్యారెక్ట‌ర్ ఎక్కువ సేపు ఉండ‌క‌పోవ‌డం విశేషం అని చెప్పుకొచ్చారు వేణు. ఇక ర‌వితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆ సినిమా ఆశించిన మేర‌కు ఆక‌ట్టుకోలేక‌పోయింది. రాబోయే రోజుల్లోనైనా త‌ను ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటారేమో చూడాలి మ‌రి.

Also Read : 

కీలక నిర్ణయం తీసుకున్న మీనా.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..!!

జ‌బ‌ర్ద‌స్త్‌లో ల‌వ్ ట్రాక్స్ అన్ని ఫేక్ అంటున్న ఇమ్మాన్యుయేల్‌..!

Visitors Are Also Reading