Home » జ‌బ‌ర్ద‌స్త్‌లో ల‌వ్ ట్రాక్స్ అన్ని ఫేక్ అంటున్న ఇమ్మాన్యుయేల్‌..!

జ‌బ‌ర్ద‌స్త్‌లో ల‌వ్ ట్రాక్స్ అన్ని ఫేక్ అంటున్న ఇమ్మాన్యుయేల్‌..!

by Anji
Ad

ఈటీవీలో ప్రసార‌మ‌య్యే ప్ర‌ముఖ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షో గా గుర్తింపు తెచ్చుకున్న జ‌బ‌ర్ద‌స్త్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌ధానంగా ఇందులో న‌డిచే ల‌వ్ ట్రాక్ ల గురించి ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చించుకోవ‌డం విశేషం. జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిపించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా స్క్రిప్ట్ త‌యారు చేస్తుంటారు మ‌ల్లెమాల యూనిట్‌. కానీ ఇటీవ‌ల అదంతా ఫేక్ అని.. కేవ‌లం టీఆర్పీ రేటింగ్ కోసం మాత్ర‌మే అంటూ అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టాడు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్ ఇమ్మాన్యుయేల్‌.


తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ కి సంబంధించి ఒక ఫుల్ స్కిట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. య‌ముడి వేషంలో గెట‌ప్ శ్రీ‌ను అద‌ర‌గొట్టేశాడ‌నే చెప్పాలి. ఇక ఈ స్కిట్ లో ఇమ్మాన్యుయేల్-వ‌ర్ష జంట హైలెట్ అనే చెప్పాలి. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన పంచ్‌లు చాలా బాగా పేలాయి. ఇందులో ఇమ్మాన్యుయేల్ త‌న‌దైన డైలాగ్‌ల‌తో రెచ్చిపోయాడు. ఇక వ‌ర్ష‌ను వాడుకొని మంచి పొజిష‌న్‌కి వ‌చ్చావ‌య్య అని గెట‌ప్ శ్రీ‌ను అన‌గానే.. ఊరుకోండి సార్ అంటూ ఇమ్మాన్యుయేల్ పేర్కొంటాడు. దానిని నేను వాడుకోవ‌డం ఏంటి.. నా ఫేమ్‌ను వాడుకొని దానికి ఫేమ్ వ‌చ్చింది.. ఎవ‌రండి ల‌వ‌ర్స్ మేము ల‌వ‌ర్స్ కాదు. ఆడియో వాళ్లు ట్రాక్ వేస్తారు. మెల్ల‌గా ద‌గ్గ‌ర‌కి వెళ్తాం.. అదేవిధంగా ట్రాక్ లో వేసి నా కొంప అంతా ముంచార‌ని చెప్పుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్‌.

Advertisement

Advertisement

 

ఇక్క‌డ స్కిట్ అవ్వ‌గానే ఇంటికి వెళ్లి నా నెంబ‌ర్ బ్లాక్‌లో పెడుతుంది. ఇక ఏ ఈవెంట్ వ‌ద్ద‌కు వెళ్లినా అన్నా వ‌దిన ఎక్క‌డ అని పలువురు ప్ర‌శ్నిస్తుంటారు. అస‌లు వ‌ర్ష ఎక్క‌డుందో నాకు ఎం తెలుసు.. అంటూ ఇమ్మాన్యుయేల్ అంద‌రినీ బాగా న‌వ్విస్తుంటాడు. అదేవిధంగా ట్రాక్ లు వేసి ఒక‌రిని పంపించారంటూ సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి కూడా పేర్కొన్నాడు. ఇప్పుడు త‌న‌ను కూడా పంపించాల‌ని ప్లాన్ వేస్తున్నార‌ని ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ షో అయితే న‌వ్వులు పూయిస్తూ బుల్లితెర ఆడియ‌న్స్ కి ఆక‌ట్టుకుంటుంది. ఇక‌పోతే ఇమ్మాన్యుయేల్ స్కిట్ ప‌రంగా కామెడీ పండించిన‌ప్ప‌టికీ ఆయ‌న చెప్పిన మాటల్లో వాస్త‌వం లేద‌ని అంతా ఫేక్‌.. కేవ‌లం టీఆర్పీ రేటింగ్ కోసం మాత్ర‌మే అన్న‌ట్టుగా అస‌లు విష‌యాన్ని బ‌య‌పెట్టాడు.

Also Read : 

ప్ర‌భాస్ చేసిన త్యాగానికి ఫ‌లితం ద‌క్క‌లేదా..? అస‌లు ఏం జ‌రిగిందంటే..!

టాలీవుడ్ లోని ఈ హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading