Home » నా నెక్స్ట్ మూవీ ఇలా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చిన బలగం వేణు..!!

నా నెక్స్ట్ మూవీ ఇలా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చిన బలగం వేణు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించినటువంటి వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ఒక చనిపోయిన వ్యక్తికీ సంబంధించిన దశదినకర్మ వరకు చేసే తంతు గురించి ఈ సినిమాలో పూర్తిగా చూపించారు. తెలంగాణలో ఇలాంటి సంప్రదాయాలు మరుస్తున్న తరుణంలో మరోసారి ఈ సినిమా ద్వారా గుర్తు చేశారు. ఈ కమర్షియల్ లైఫ్ లో చాలామంది కుటుంబాలు విడిపోతున్నాయి. డబ్బు చుట్టే తిరుగుతూ అయిన వాళ్లనే మోసం చేస్తున్నారు కొంతమంది చంపేస్తున్నారు.

also read:ఈ లక్షణాలున్న భర్త దొరికితే.. ఇక భార్య జీవితం సంతోషమే..!

Advertisement

పంతాలకు పోయి సొంత అన్నదమ్ములే విడిపోతున్నారు. అలాంటి ఈ సమాజంలో తన బలగం సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు వేణు. ప్రస్తుతం ఈ సినిమాను పల్లెటూర్లలో ప్రత్యేకమైన తెరలు కట్టుకొని మరీ చూస్తున్నారు. కనీసం 30 నుండి 40 ఏజ్ ఉన్న వాళ్ళు సినిమా థియేటర్ వైపు చూడని కొంతమంది గ్రామీణ ప్రజలు థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూస్తున్నారంటే ఈ సినిమా ప్రజలకు ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చూసిన ప్రజలంతా వేణు డైరెక్షన్ ను మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు క్యూకడుతున్నాయి.

Advertisement

also read:AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

ఈ తరుణంలో వేణు ఒక సందర్భంలో మాట్లాడుతూ తన తదుపరి సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చారు. నా నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజ్ బ్యానర్ లోనే ఉంటుందని అన్నారు. రాబోయే సినిమా కూడా ఈ విధంగానే ఫ్యూర్ కథతోనే వస్తానని తెలిపారు. కథలో బలం ఉంటే థియేటర్ల వైపు బలగాన్ని నడిపిస్తుందని తెలియజేశారు. బలగం సినిమా ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయని ముందే నమ్మానని అదే నిజమైందని తెలియజేశారు. సినిమా ఇంత రెస్పాన్స్ రావడం నాకెంతో ఆనందాన్నిస్తుందని, మళ్లీ ఇలాంటి ప్యూర్ కథతోనే మరో సినిమాతో వస్తానని క్లారిటీ ఇచ్చారు.

also read:

Visitors Are Also Reading