Home » జీవిత రాజశేఖర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిందా.. అంత కక్ష ఏంటో..?

జీవిత రాజశేఖర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిందా.. అంత కక్ష ఏంటో..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో జీవిత రాజశేఖర్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే కాబట్టి అందరికీ తెలుసు. అలాంటి జీవిత రాజశేఖర్ లవ్ స్టోరీ లో అనేక ట్విస్టులు ఉన్నాయి.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తలంబ్రాలు మూవీ నుంచి మొదలైన వీరిద్దరి ప్రేమాయానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే వారి లవ్ స్టోరీ గురించి తాజాగా అభిమానులతో పంచుకున్నారు. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక చిట్ చాట్ షోకు జంటగా వచ్చిన వీళ్లు వారి లవ్ స్టోరీ కి సంబంధించిన పలు విషయాలను బయటపెట్టారు.

also read:అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు

Advertisement

జీవితని మొదటిసారి చూసి ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి.. తీసేయండి అని చెప్పినట్టు రాజశేఖర్ చెప్పుకోచ్చారు. ఆ తర్వాత ఇదే సినిమాలో తనను తీసేసి మరో హీరోతో చేశారని చెప్పాడు. ఇక మూడు సినిమాలు కలిసి చేశాక ఒకసారి రాజశేఖర్ జీవిత వద్దకు వెళ్లి నాకు ఎక్కడో మీరు నామీద ఆసక్తి చూపిస్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్పాడట. అలా డైరెక్ట్ గా నాతో చెప్పడం ఆయన ఫ్రాంక్ నెస్ నాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది జీవిత. రాజశేఖర్ ను వివాహం చేసుకోవడానికి జీవిత చాలా కష్టపడిందట. వారి అమ్మానాన్నలను ఒప్పించడానికి పెద్ద రిస్కు చేసినట్టు రాజశేఖర్ చెప్పారు.

Advertisement

also read:శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా..!

ఈ ప్రేమ వ్యవహారం అంతా అయ్యాక మా ప్రేమ విషయం రాఘవేంద్రరావుకు తెలిసి రాజశేఖర్ విలన్ లా ఉన్నాడు నమ్మకంటూ జీవితకు సలహా ఇచ్చారట. ఆ తర్వాత జీవిత నన్ను ఒక బ్రిడ్జిపై నుంచి తోసేసి హాస్పిటల్లో చేర్పించింది. ఆ తర్వాత ఆవిడే నాకు సేవలు చేసి మా అమ్మ నాన్నలు ఒప్పుకునేలా చేసుకుంది. అయితే ముందుగా రాజశేఖర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట, ఒకప్పుడు తాను ఆయన కలిసి కూర్చున్న కారులో ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు నాకు ఎంతో బాధ అనిపించిందని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశులకు చెందిన వారు శుభవార్తలు వింటారు

Visitors Are Also Reading