Home » AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

by Bunty
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో,కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

 

Advertisement

 

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై టీజర్ విడుదల వరకు ఎలాంటి వార్తలు రాలేవు. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఈ సినిమా గురించి ఓ రేంజ్ లో చర్చ జరిగింది. టీజర్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజాగా, హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా ‘ఆది పురుష్’ సినిమా నుంచి న్యూ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమా నుంచి హనుమంతుని పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది.

Read Also : అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు

 

 

Visitors Are Also Reading