Home » Varun Tej – Lavanya : వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !

Varun Tej – Lavanya : వరుణ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ !

by Bunty
Ad

మెగా హీరోలలో వరుణ్ తేజ్ భిన్నమైన వ్యక్తి. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసిన వరుణ్ తేజ్… అందులో చాలా డిఫరెంట్ కథాంశాలను ఎంచుకొని తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా చేస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య లవ్ ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీరిద్దరిపై యదేచ్చగా వార్తలు వస్తున్నా… వాటిని ఈ జంట ఖండించలేదు. దీంతో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య ఎఫ్ ఫైర్ ఉందని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్ కి కూడా సిద్ధమైంది. జూన్ 9వ తేదీన లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లోని ఓ ప్యాలస్ లో రాత్రి జరగనుందట.

Advertisement

ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానుందని సమాచారం అందుతోంది. ఇటీవల కాలంలో నాగబాబు.. వీరిద్దరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇక వీరి వివాహం నవంబర్లో లేదా డిసెంబర్ మాసంలో జరగనుందని కూడా సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే జరుగుతోంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

Visitors Are Also Reading