Home » మెగా ఫ్యామిలీని క్రికెట్ టీమ్ తో పోల్చిన వరుణ్ తేజ్.. సోషల్ మీడియాలో వైరల్..!

మెగా ఫ్యామిలీని క్రికెట్ టీమ్ తో పోల్చిన వరుణ్ తేజ్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.మెగా హీరో కొణిదెల నాగబాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.ఇదిలా ఉంటే.. హీరో వరుణ్ తేజ్ త్వరలోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మెగా ఫ్యామిలీ గురించి హీరో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ  వైరల్ గా మారాయి. అసలు వరుణ్ తేజ్ ఏం కామెంట్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

వరుణ్ తేజ్ తాజాగా వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా.. తాను  కొత్త అవతారం ఎత్తాడు. అక్టోబర్ 22న ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్ జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డిన విషయం తెలిసిందే. అయితే  ఈ మ్యాచ్ లో  తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. అక్కడ ఇతర కామెంటేటర్స్ తో కలిసి క్రికెట్ అభిమానులను వరుణ్ తేజ్ అలరించాడు. ఈ క్రమంలోనే వరుణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో క్రికెట్ ఆడే వారు ఎవ్వరు..? చూసే వారెవ్వరూ స్టార్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించగా.. నేను, బన్నీ అన్న, చరణ్ అన్న, తేజ్, శిరీష్ అందరం కలిసి వచ్చి ఆడుతాం అని తెలిపాడు.  ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

వీటిపై ఆడియన్స్ సరదా కామెంట్స్ తో రియాక్ట్ అవుతూ వస్తున్నారు.  వరుణ్ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. వరుణ్ 13వ సినిమాగా వస్తున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేశాడు వరుణ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 8న తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో రిలీజ్ కానుంది.  ఈ మూవీలో బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. కాగా మెగా హీరోలను క్రికెట్ టీం తో పోలుస్తూ వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు మెగా అభిమానులు మండిపడుతుండగా..  మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమాల వార్తల కోసం ఇక్కడ చూడండి.  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి.

Visitors Are Also Reading