Home » మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వరుణ్ లావణ్య.. పెళ్లి సందడిలో మెగా హీరోలు

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వరుణ్ లావణ్య.. పెళ్లి సందడిలో మెగా హీరోలు

by Anji
Ad

మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి వివాహం నవంబర్ 01న మధ్యాహ్నం 2.30 గంటలకు ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తరువాత సాయంత్రం ఇటలీలోని టస్కానీలో రిసెప్షన్ జరిగింది. అక్టోబర్ 30న మొదలైన ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది.

Advertisement

వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి వేడుకలో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ వీరి పెళ్లి వేడుకలో కనిపించారు. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హొత్రా డిజైన్ చేసిన దుస్తులను పెళ్లిలో వరుణ్, లావణ్య ధరించారు.  నవంబర్ 05న మాదాపూర్ ఎన్. కన్వెన్షన్ హాల్ రిసెప్షన్ జరుగనుంది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. 2017లో మిస్టర్ మూవీ లో లావణ్య, వరుణ్ తేజ్  వీరిద్దరూ కలిసి నటించారు.  ఆ పరిచయంలోనే  వీరు ప్రేమలో మునిగి తేలారు.

Advertisement

 

మిస్టర్ మూవీ సమయంలో ఏర్పడిన పరిచయం.. ఆ తరువాత ప్రేమగా మారింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంతరిక్షం సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయింది. అంతకు ముందు జూన్ 09న వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ కి పలువురు సినీ హీరోలు సందడి చేశారు. ప్రస్తుతం వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మట్కా సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని  సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading