Home » సమంత వ్యాధి పై కర్మ అంటూ వర్షిణి పోస్ట్..!

సమంత వ్యాధి పై కర్మ అంటూ వర్షిణి పోస్ట్..!

by Azhar
Ad
టాలీవుడ్ లో టాప్ హీరోయినా గా కొనసాగింది సమంత. అయితే అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకొని సినిమాలను కొంచెం దూరం పెట్టిన సమంత.. ఇప్పుడు విడాకుల తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ కాలనీ తెగ ప్రయత్నిస్తుంది. ఆ తరుణంలోనే తాజాగా సమంత ఫ్యాన్స్ కు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది. తాను కొన్ని నెలల నుండి ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఇక గతంలో ఈ మయోసైటిస్‌ అనే వ్యాధి గురించి ఎక్కువగా విన్నానో అభిమానులు అది ఏంటి అంటూ తెలుసుకుంటూ.. ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ వారు కూడా అదే రకమైన పోస్టులు అనేవి పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే నటిగా యాంకర్ గా గుర్తింపు అనేది తెచ్చుకున్నా వర్షిణి సమంత పై చేసిన పోస్ట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే వర్షిణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అనేది ఉంది. ఇక సమంత నిన్న తన జబ్బు గురించి వెల్లడించిన తర్వాత.. కర్మ అనేది ఒక బూమరాంగ్.అది తిరిగి మనల్ని బలంగా కొడుతుంది అంటూ సమంత గతంలో ఓ సమయంలో చేసిన కామెంట్స్ ను తన ఇంస్టా స్టోరీలో పెట్టింది వర్షిణి. అయితే ఈ సమయంలో వర్షిణి సమంత కామెంట్స్ ను ఇలా పోస్ట్ చేయడం వెనుక ఏ కారణం ఉంటుందా అని ఫ్యాన్స్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading