Home » ఇండియా, పాక్ మ్యాచ్ లైవ్ లో చూడాలని ఉంది..!

ఇండియా, పాక్ మ్యాచ్ లైవ్ లో చూడాలని ఉంది..!

by Azhar
Ad

క్రికెట్ అనేది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఆటలలో ఒక్కటి. అయితే ఈ క్రికెట్ లో ఎన్నో మ్యాచ్ లు జరుగుతాయి.. కానీ అందులో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ కు ఉండే స్పెషాలిటీ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ప్రజలే కాదు.. మొత్తం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అందరూ ఎదురు చూస్తుంటారు.

Advertisement

అయితే ఈ ఏడాది తాజాగా ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనేది హైలెట్ అనే చెప్పాలి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు అనుకుదానికంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. అయితే ఈ కిక్ ను లైవ్ లో చూడాలి అని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు.

Advertisement

తాజాగా ఫించ్ మాట్లాడుతూ… మ్యాచ్ ఫలితం ఎలా ఉన్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. ఈ మ్యాచ్ ను ఓ అభిమానిగా చాలా ఎంజాయ్ చేస్తా. అయితే నేను రిటైర్ అయిన తరువాత తప్పకుండ ఇండియా, పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా నేను అక్కడికి వెళ్లి లైవ్ మ్యాచ్ అనేది చూస్తా అని ఫించ్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన ఇనింగ్స్ వేరే లెవల్ అని.. అంత ఒత్తిడిలో అలాంటి షాట్స్ ఆడటం మాములు విషయం కాదు అని ఫిచ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

ఇండియా గెలుపుపైనా పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆశలు..!

బుమ్రా లేకపోయినా గెలుస్తాం..!

Visitors Are Also Reading