Home » బాలయ్యను డామినేట్ చేసిన జయమ్మ..!

బాలయ్యను డామినేట్ చేసిన జయమ్మ..!

by Azhar
Ad

హీరో, హీరోయిన్ లేదా సైడ్ ఆర్టిస్ట్ అయిన కొన్ని పాత్రలు వారికీ మ్బచి పేరును అలాగే అవకాశాలు తెస్తాయి. తెలుగులో వరలక్ష్మికి కూడా జయమ్మ పాత్ర అలాంటిదే అని చెప్పాలి. అయితే వరలక్ష్మి తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత.. రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో ఆమెకు జయమ్మ పాత్ర అనేది వచ్చింది. అయితే ఈ లేడి విలన్ పాత్రలో వరలక్ష్మి అందరిని మెప్పించింది.

Advertisement

దాంతో అప్పటి నుండి వరలక్ష్మికి అవకాశాలు అనేవి పెరిగాయి. ఇక తాగాజా అల్లరి నరేష్ హిట్ అందుకున్న నాంది సినిమాలో కూడా వరలక్ష్మి లాయర్ గా మంచి మార్కులు అనేవి తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మి నటిస్తుంది. క్రాక్ సినిమాను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

అయితే మాములుగా భారీ డైలాగులు పవర్ ఫుల్ గా చెప్పడంలో బాలయ్య దిట్ట అనేది అందరికి తెలిసిందే. కానీ ఇందులో వరలక్ష్మి బాలయ్యను డామినేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం షూట్ అవుతున్న ఈ సినిమాలో ఎంతో కీలక పాత్రలో నటిస్తున్న వరలక్ష్మి.. బాలయ్యకు వ్యతిరేకంగా 5 పేజీల డైలాగ్ అనేది చెప్పాలి. అయితే ఈ డైలాగ్ ను మొత్తం వరలక్ష్మి కేవలం సింగిల్ టెక్ లో చెప్పడంతో.. అక్కడ ఉన్నవారు అందరూ షాక్ అయ్యారు అని.. తర్వాత ఆమెను బాలయ్యతో పాటుగా అందరూ అభినందించారు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియాలో ఇండియా జట్టుకు భద్రత లేదా..?

రాహుల్ వల్ల ఇండియా పేరిట చెత్త రికార్డులు..!

Visitors Are Also Reading