Home » ఫాలో ఫాలో ఫాలో అంటూ పంత్ వెనుక ఆసీస్ వెళ్లిన ఊర్వశీ..!

ఫాలో ఫాలో ఫాలో అంటూ పంత్ వెనుక ఆసీస్ వెళ్లిన ఊర్వశీ..!

by Azhar
Ad
ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలోని ఫాలో ఫాలో ఫాలో యూ అంటే బాట బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలాకు బాగా సెట్ అవుతుంది అని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. అయితే కొన్ని రోజులుగా ఊర్వశీ రౌటేలా ఆలాగే భారత జట్టు యువ వికెట్ కీపర్ రిషప్ పంత్ కు మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి అందరికి తెలిసిందే.
మొదట ఒక్కరి మీద ఒక్కరు పరోక్షంగా విమర్శలు అనేవి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఊర్వశీ రౌటేలా పంత్ ను ఫాలో కావడం మొదలు పెట్టింది. ఈ వివాదం తర్వాత ఆసియా కప్ కోసం పంత్ యూఏఈ వెళ్లగా.. అక్కడికి వెళ్లిన ఊర్వశీ రౌటేలా మ్యాచ్ లకు కూడా హాజరైంది. ఈ మధ్యే పంత్ పుట్టిన రోజునాడు.. ఎవరికో చెప్పకూండా.. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ అనేవి చెప్పింది.
అయితే పంత్ తాజాగా.. భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న.. ప్రపంచ కప్ కోసం అక్కడికి వెళ్ళాడు. అయితే టీం ఇండియా వెళ్లి ఒక్క రోజు కాకముందే.. నేను ఆస్ట్రేలియా వెళుతున్నాను అని ఊర్వశీ రౌటేలా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. అంతే.. ఊర్వశీ రౌటేలా పంత్ కోసమే వెళ్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక పంత్, ఊర్వశీ రౌటేలాకు సంబంధిన మిమ్స్ అనేవి చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading