Home » భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడద్దు..!

భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడద్దు..!

by Azhar
Ad

క్రికెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఆట అనేది అందరికి తెలుసు. అయితే ప్రస్తుతం క్రికెట్ లో మూడు ఫార్మట్స్ ఉండగా.. ఈ మధ్యే కాలంలో లీగ్ క్రికెట్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఈ లీగ్ క్రికెట్ మొదట మన ఇండియాలోనే ఐపీఎల్ గా జన్మించి.. ఇప్పుడు చాలా దేశాలలో జరుగుతుంది. అయితే ఈ లీగ్ క్రికెట్ లో బాగానే ఆడే ఆటగాళ్లు.. దేశం కోసం ఆడాల్సిన సమయం వచ్చిన తర్వాత ప్రెసర్ అనే పేరు చెబుతున్నారు.

Advertisement

ఇక మన భారత ఆటగాళ్లు కూడా చాలా మంది ప్రెసర్ అంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రెసర్ అనే పదం తప్పు అని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అంటున్నాడు. ఇష్టపడి ఏ పని చేసిన అందులో ప్రెసర్ అనేది ఉండదు అని చెప్పాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఈ మధ్యే నేను ప్రెసర్ అనే పదం ఎక్కువ వింటున్నాను.

Advertisement

భారత ఆటగాళ్లు ఎవరైనా ప్రెసర్ ను ఫీల్ అయితే ముందు ఐపీఎల్ ఆడటం మానేయండి. అప్పుడు కావాల్సినంత సమయం దొరుకుతుంది. గాయాలు కూడా తగ్గుతాయి. మేము కూడా చాలా క్రికెట్ ఆడాము. అయితే మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు ప్రెసర్ గ ఆమెము ఫీల్ కాలేదు. కానీ ఇప్పుడు అందరూ ప్రెసర్ అంటున్నారు. అసలు నా దృష్టిలో ఈ ప్రెసర్ అనేదే తప్పు అని కపిల్ దేవ్ అన్నారు.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఒక్క ఏడాదిలో 60 మంది ఆటగాళ్లను ఆడిస్తుందా..?

పొజిషన్ లో సూర్య స్థానంలోకి బాబర్..!

Visitors Are Also Reading