Home » రిష‌బ్ పంత్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన ఆ బాలీవుడ్ న‌టి..!

రిష‌బ్ పంత్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన ఆ బాలీవుడ్ న‌టి..!

by Anji
Ad

భార‌త యువ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్‌, బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతేలా మ‌ధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గ‌తంలో త‌న కోసం చాలా సేపు ఎయిర్‌ఫోర్టులో ఆర్‌పీ అనే వ్య‌క్తి వెయిట్ చేశాడంటూ.. ప‌రోక్షంగా రిష‌బ్ గురించి ప్రస్తావించింది. తాజాగా నిర్వ‌హించిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ ఎక్క‌డ చెడిపోయింద‌నే విష‌యాన్ని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఊర్వ‌శి పేరు ప్ర‌స్తావించ‌కుండా ఫేమ్‌, పాపులారిటీ కోసం ఇన్ని ప‌చ్చి అబ‌ద్దాలు ఆడుతారా అని పంత్ ఫైర్ అయ్యాడు. అందుకు రిష‌బ్ పంత్‌కి దిమ్మ‌తిరిగేలా షాక్ ఇచ్చింది. చిన్న త‌మ్ముడు పోయి బ్యాట్ బాల్‌తో ఆడుకో అంటూ పంత్ కు ఊర్వ‌శి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.


ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్‌, ఊర్వ‌శి రౌతేలా మ‌ధ్య మాట‌ల యుద్ధం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు ఏం జ‌రిగిందంటే..? ఇటీవ‌ల ఊర్వ‌శి రౌతేలా కోసం ఎయిర్ ఫోర్టులో గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూశాడ‌ని.. వీరిద్ధ‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని వార్త‌లు వినిపించాయి. వీటిపై ఓ ఇంట‌ర్వ్యూలో ఊర్వ‌శి మాట్లాడింది. త‌న కోసం ఆర్‌పీ గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూశాడ‌ని వెల్ల‌డించింది. తాను షూటింగ్‌కి వెళ్లి అల‌సిపోవ‌డం వ‌ల్ల జ‌ర్నిలో ప‌డుకున్నాన‌ని.. నిద్ర లేచి చూసే స‌రికి ఆర్‌పీ నుంచి 16 నుంచి 17 మిస్డ్‌కాల్స్ వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చింది. ఇక ఆర్‌పీ ఎవ‌ర‌ని అడ‌గ్గా తాను పేరు చెప్ప‌న‌ని దాట‌వేసింది ఊర్వ‌శి. దీంతో ఆర్‌పీ అంటే రిష‌బ్ పంత్ అనే అభిప్రాయానికి వ‌చ్చారు.

Advertisement

Advertisement


సోష‌ల్ మీడియాలో ఊర్వ‌శి వ్యాక్య‌లు వైర‌ల్ కావ‌డంతో రిష‌బ్ పంత్ స్పందిస్తూ.. ఆమె పేరు ప్ర‌స్తావించ‌కుండానే కొంత మంది ఫేమ‌స్ అవ్వ‌డం కోసం అబ‌ద్దాలు ఎలా ఆడ‌తారో కూడా తెలియ‌ద‌న్నారు. వారి స్వార్థం కోసం అవుత‌లి వ్య‌క్తుల‌ను బ‌లి చేస్తార‌నే విదంగా అర్థం వ‌చ్చేలా కౌంట‌ర్ ఇచ్చారు. అంతేకాదు.. అక్కా ప్లీజ్ న‌న్ను వ‌దిలేయండి అని హ్యాష్ ట్యాగ్‌తో కౌంట‌ర్ ఇచ్చాడు యంగ్ క్రికెట‌ర్ రిష‌ప్ పంత్‌. అత‌ని పోస్ట పై ఊర్వ‌శి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. రిష‌బ్ పంత్‌ని కౌగ‌ర్ హంట‌ర్ అని తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. చోటా భ‌య్యా బ్యాట్ బాల్‌తో ఆడుకో.. నేను మున్నిని కాదు.. నీ లాంటి పిల్ల బ‌చ్చాల వ‌ల్ల బ‌ద్‌నాం అవ్వ‌డానికి అని గ‌రం అయింది. అంతేకాదు.. ఈ పోస్ట్‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు ఆర్‌పీ చోటు భ‌య్యా అని ట్వీట్ చేసింది. వీరిద్ద‌రి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : 

ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతోన్న దిల్‌రాజు.. ఒక్క‌రోజులేనే 36వేల ట్వీట్లు.. అస‌లు కార‌ణం అదేనా..?

స్టూడెంట్ నంబ‌ర్ 1 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ అగ్ర‌హీరో అత‌డేనా..?

Visitors Are Also Reading