Home » ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతోన్న దిల్‌రాజు.. ఒక్క‌రోజులేనే 36వేల ట్వీట్లు.. అస‌లు కార‌ణం అదేనా..?

ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతోన్న దిల్‌రాజు.. ఒక్క‌రోజులేనే 36వేల ట్వీట్లు.. అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్‌కి చెందిన అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రు దిల్ రాజు. ఆయ‌న ముఖ్యంగా అగ్ర‌, యువ హీరోల‌తో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేసి ఇండ‌స్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొన‌సాగుతున్నారు. దిల్ సినిమాతో ఆయ‌న దిల్ రాజుగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌స్తుతం దిల్ రాజు రెండు భారీ ప్రాజెక్ట్‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. ఒక‌టి రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబోలో, మ‌రొక‌టి వంశీపైడిప‌ల్లి-విజ‌య్ కాంబినేష‌న్‌.


ఇదిలా నిర్మాత దిల్ రాజు పేరు ట్విట్ట‌ర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఒక్క రోజులోనే ఏకంగా 36 ట్వీట్లు ఆయ‌న పేరు మీద పోస్ట‌య్యాయి. ప్ర‌స్తుతం దిల్‌రాజు సినిమా ఏది కూడా విడుద‌ల‌వ్వ‌డం లేదు. కానీ ఆయ‌న పేరు మాత్రం ట్రెండ్ అవుతోంది. ఈ ట్రెండింగ్ వెనుకాల ఉన్న అస‌లు క‌థ ఏమిటంటే..? మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాగా ఆర్‌సీ 15 రూపుదిద్దుకుంటోంది. కియారా అద్వాని క‌థాయిక‌గా నటిస్తున్న ఈ చిత్రం గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 08న పూజా కార్య‌క్ర‌మం ప్రారంభం అయింది. ఇక అప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, ముంబ‌యి, పంజాబ్ ఇలా ప‌లు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కొన‌సాగించారు.

Advertisement

Advertisement


ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇందులో ప‌ని చేస్తున్న న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేస్తూ కేవ‌లం ఒకే ఒక్క పోస్ట‌ర్ ని మాత్ర‌మే చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభ‌మై సంవ‌త్స‌రం కావ‌స్తున్నా ఆర్‌సీ 15 నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో మెగా అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. చిత్ర నిర్మాత దిల్ రాజుని ట్యాగ్ చేస్తూ.. అప్‌డేట్స్ ఇవ్వాల‌ని ట్వీట్స్ చేస్తున్నారు. దిల్ రాజు గాఉ ద‌యచేసి అప్‌డేట్ ఇవ్వండి అని ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒక రోజులోనే 36వేల‌కు పైగా ట్వీట్స్ చేయ‌డం విశేషం. దీంతో నిర్మాత దిల్ రాజు పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ చిత్రంలో శ్రీ‌కాంత్‌, సునీల్‌, అంజ‌లి వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికైనా అభిమానుల అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ సినిమా అప్‌డేట్‌కి సంబంధించి ఏదైనా ప్ర‌క‌ట‌న చేస్తారో లేదో వేచి చూడాలి.

Also Read : 

అమీర్‌ఖాన్ సినిమాకి ఆ స్టార్ క్రికెట‌ర్ల రివ్యూ.. ఎలా ఉందంటే..?

పిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లులు మ‌ధుమేహాన్ని ఈ చిట్కాల‌తో కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

Visitors Are Also Reading