Home » స్టూడెంట్ నంబ‌ర్ 1 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ అగ్ర‌హీరో అత‌డేనా..?

స్టూడెంట్ నంబ‌ర్ 1 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ అగ్ర‌హీరో అత‌డేనా..?

by AJAY

కొన్ని సినిమాలు మొదట ఒక హీరో వద్దకు వెళ్లి చివరికి మరో హీరో చేతికి వెళతాయి. అలా జరగటానికి చాలా కారణాలు ఉంటాయి….కథ నచ్చకపోవడం తో హీరోలు రిజెక్ట్ చేయడమో…కథ నచ్చినా కూడా తమ కు సెట్ అవ్వదని నో చెప్పడమో ఇలా చాలా కారణాలు ఉంటాయి. అలానే ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా స్టూడెంట్ నంబర్ సినిమా కూడా మరో హీరో చేయాల్సిందే. నందమూరి హీరో ఎన్టీఆర్ చూడాలని ఉంది సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తరవాత రాజమౌళి దర్శకత్వం లో స్టూడెంట్ నంబర్ వన్ సినిమా లో నటించాడు. ఈ సినిమా తోనే జక్కన్న సినిమా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి శాంతి నివాసం సీరియ‌ల్ కు దర్శకత్వం వహించారు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కింది.

ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని ద‌త్ నిర్మించారు. అయితే తాజా ఇంట‌ర్య్వూలో అశ్విని ద‌త్ స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాము చ‌రణ్ తో చిరుత‌, అల్లు అర్జున్ తో గంగోత్రి, మ‌హేశ్ బాబుతో రాజ‌కుమారుడు సినిమాలు చేసి వారిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశామని చెప్పారు.

ఎన్టీఆర్ ఒక్క‌డితోనే రెండో సినిమాను నిర్మించామని చెప్పారు. ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌ని హ‌రికృష్ణ కోరార‌ని తెలిపారు. అంతే కాకుండా స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ సినిమా ప్ర‌భాస్ తో చేయాల‌ని అనుకున్నామని అన్నారు. కానీ హ‌రికృష్ణ ఫోన్ చేయడం వ‌ల్ల‌నే ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కు వ‌చ్చింద‌ని తెలిపారు. దాంతో ప్ర‌భాస్ స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాను మిస్ చేసుకున్నాడ‌ని తెలిసింది.

Visitors Are Also Reading