Home » సిల్క్ స్మిత కు అంతటి అన్యాయం జరిగిందా….? చివరికి నిర్మాతలు కూడా…?

సిల్క్ స్మిత కు అంతటి అన్యాయం జరిగిందా….? చివరికి నిర్మాతలు కూడా…?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మెరిసిన తారలు ఎంతోమంది కన్నుమూశారు. అయితే అందులో ప్రేక్షకులు కొంతమందిని మాత్రమే గుర్తుంచుకున్నారు. అలా ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేని నటి సిల్క్ స్మిత… ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా వచ్చిన సిల్క్ స్మిత స్టార్ గా వెలుగు వెలిగారు. చిన్న వయసులోనే పెళ్లి జరగడంతో భర్త పెట్టే టార్చర్ ను భరించలేక సిల్క్ స్మిత తన పిన్నితో కలిసి మద్రాస్ చేరుకున్నారు.

Advertisement

అక్కడ మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సమయంలో ఓ నిర్మాత కంట్లో పడ్డారు. అలా మొదటిసారి సిల్క్ సినిమా అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని బిజీ నటిగా మారిపోయారు. దర్శకులు.. నిర్మాతలు, హీరోలు కచ్చితంగా తమ సినిమాల్లో సిల్క్ ఉండాలని కోరుకునేవారు. ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా సిద్ధపడేవారు.

Advertisement

అయితే చాలాకాలం పాటు బిజీ నటిగా రాణించిన సిల్క్ ను ప్రముఖ నటుడు మోసం చేశాడు అన్న సంగతి చాలా మందికి తెలుసు. ఈ విషయాన్ని సిల్క్ స్మిత లేఖలో రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ ఆ నటుడు ఎవరో ఇప్పటికీ బయటకు రాలేదు. ఇక సిల్క్ చనిపోయిన అనంతరం ఆమె గురించి రకరకాల వార్తలు పుట్టుకువచ్చాయి. అందులో నిజాలు ఎన్నో అబద్ధాలు ఎన్నో ఎవరికి తెలియదు. ఇక ఇప్పటికీ సిల్క్ అంటే చాలా మంది ఇష్టపడతారు. దాంతో ఆమె జీవితాన్ని సైతం నిర్మాతలు వ్యాపారంగా మలుచుకున్నారు.

డర్టీ పిక్చర్ సినిమా పేరుతో సిల్క్ రియల్ లైఫ్ ను రీల్ లైఫ్ గా మలచారు. ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురిసింది. బాలీవుడ్ వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ విడుదల చేయగా ఇక్కడ కూడా బాగానే ఆడింది. అంతేకాకుండా పాకిస్తాన్ నటి వీణా మాలిక్ తో కన్నడలో కూడా సిల్క్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు. అదేవిధంగా సనా ఖాన్ తో మలయాళం లోనూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక సిల్క్ జీవితంతో సినిమాలు చేసినా ఆమె కుటుంబానికి మాత్రం ఏమి లాభం జరగలేదు అనే వాదన కూడా ఉంది. సిల్క్ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలోకి వచ్చి ఒక వెలుగు వెలిగారు…. కానీ సినిమాల వల్ల ప్రేక్షకులకు వినోదం పంచడం తప్ప ఏమీ సంపాదించుకోలేదు. సంప్రదించకున్నది కూడా ప్రశాంతంగా అనుభవించలేదు.

Also read :రాజమౌళి to ప్రశాంత్ నీల్ దేశమంతటా క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ వీళ్ళే..!!

Visitors Are Also Reading