పవన్ కళ్యాణ్, బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య అడిగే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ, జీవితంలో నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను.
Advertisement
Advertisement
బ్రహ్మచారిగానే ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇక తాజాగా యూట్యూబ్ రికార్డులు షేక్ చేయడానికి బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్-2 ప్రోమో ని దించింది ఆహా మేనేజ్మెంట్. ఈ ప్రోమోలో మరిన్ని ఆసక్తికర విషయాలు ముచ్చటించారు బాలయ్య, పవన్. ముఖ్యంగా రెండో ఎపిసోడ్ లో రాజకీయపరమైన ప్రశ్నలు సంధించారు బాలయ్య. ఆ ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు చెప్పారు అన్నది ఆసక్తికరంగా మారింది.
పవన్ కారుపైకి ఎక్కి కూర్చున్న ఫోటోను చూపించి ప్రశ్నలు అడిగారు బాలయ్య. ఈ ప్రశ్నలన్నింటికీ పవన్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ఒక అవ్వ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం, పవన్ సీఎం అయ్యాక చూసిన తర్వాత చనిపోతానని చెప్పడంతో పవన్ ఆమె కాళ్ళకు దండం పెట్టారు. ఈ ప్రోమోలో చూడొచ్చు. చివరిగా బాలకృష్ణ చెప్పిన డైలాగుకు పవన్ ఫిదా అయ్యాడు.
Advertisement
READ ALSO : ఇంత లావుగా ఉన్న అమ్మాయి… ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా !