Home » Unstoppable season 2 episode 3 Promo : ప్రభాస్ పేరు చెప్పుకుని తిరుగుతుంటే.. నా పేరు చెబుతావా అంటున్న శర్వానంద్

Unstoppable season 2 episode 3 Promo : ప్రభాస్ పేరు చెప్పుకుని తిరుగుతుంటే.. నా పేరు చెబుతావా అంటున్న శర్వానంద్

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతగా క్లిక్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మొదటి సీజన్ ఓ రేంజ్ లో క్లిక్ అవ్వడంతో రెండో సీజన్ మీద మరింత ష్టిపెట్టారు. అయితే రెండో సీజన్ తొలి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ లు సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ వంటి మాస్ హీరోలు వచ్చారు. ఈ మూడో ఎపిసోడ్ కు క్లాస్ హీరోలైన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ లైన శర్వానంద్, అడివిశేషులు గెస్ట్ లుగా వచ్చారు.  తాజాగా ప్రోమో విడుదల చేశారు.  విడుదల చేసిన ఈ ప్రోమో ఎలా ఉందో చూద్దాం.

Advertisement

రెండో ఎపిసోడ్ లో మాస్ హీరోలతో తన క్రష్ రష్మిక అని బాలయ్య చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ లో శర్వానంద్ ఆ కోరికను తీర్చేశాడు. రష్మికకు వీడియో కాల్ చేసి బాలయ్యతో మాట్లాడించాడు శర్వానంద్. ఇక ఈ కుర్ర హీరోలతో బాగానే కలిసి పోయాడు శర్వానంద్ అయితే ేకంగా బాలయ్య నాటీ పనులను బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. మీరు వంద సినిమాలకు పైగా చేశారు కదా ? అంటే పాతిక 30 మంది హీరోయిన్లతో చేశారు కదా..? అని బాలయ్యని ఇరికించే ప్రయత్నం చేశాడు శర్వానంద్. ఏం చేశాడు రా అని అడివి శేష్ నోరెళ్లబెట్టేశాడు. అదే యాక్టింగ్ చేశారు కదా ? అని అడుగుతున్నా అటూ కవర్ చేసేశాడు శర్వానంద్.

Advertisement

Also Read :  జబర్దస్త్ కొత్త జడ్జ్ లుగా కృష్ణభగవాన్, పోసాని కృష్ణ మురళి

ఇదే బీ, సీ సెంటర్ల తెలివి తేటలు అని బాలయ్య కౌంటర్ వేశాడు. దీంతో శర్వా, అడివి శేష్ ఇద్దరు పగలబడి నవ్వేస్తారు. ఈ ఎపిసోడ్ ఇలా ఫన్నిగానే సాగింది. బాలయ్య అడివిశేష్ పెళ్లిపై ప్రశ్నలు వేశాడు. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్లున్నారు. ప్రభాస్, శర్వానంద్ వంటి వారు పెళ్లి చేసుకున్న తరువాత నేను చేసుకుందామని అనుకుంటున్నాను అని అడివిశేష్ అంటుంటాడు. నేను ప్రభాస్ పేరు చెప్పుకొని తిరుగుతుంటే నువ్వు నా పేరు చెప్పుకుంటున్నావా అని శేష్ పరువుతీస్తాడు శర్వానంద్. నిజం చెబితే బట్టలు విప్పాలంటూ బాలయ్య ఓ టాస్క్ పెట్టాడు. తనకు సంబంధించిన ప్రశ్ననే అడిగేసుకున్నాడు. సెల్పీ అడిగితే కొట్టే హీరో ఎవరు అని బాలయ్య అడుగుతాడు దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. జాను సినిమా సమయంలో జరిగిన ప్రమాదం మీద శర్వాను అడిగాడు బాలయ్య. ఈ ఎపిసోడ్ లో అన్ని కోణాలను టచ్ చేశారు.

Also Read :  2023 లో చాలా దుర్ఘటనలు.. భయపెడుతున్న బాబా వెంగా జ్యోతిష్యం..!

Visitors Are Also Reading