Home » పవిత్ర లోకేష్ ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ అదేనా ? 16 ఏళ్ల వయసులోనే ఆమెకు జరిగిన ఆ సంఘటన..!

పవిత్ర లోకేష్ ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ అదేనా ? 16 ఏళ్ల వయసులోనే ఆమెకు జరిగిన ఆ సంఘటన..!

by AJAY
Ad

మొన్న‌టివ‌ర‌కూ ప‌విత్రా లోకేష్ ఎవ‌ర‌న్న సంగ‌తి చాలా మందికి తెలియదు. కానీ గ‌త కొద్దిరోజులుగా ఈ పేరు నెట్టింట తెగ చక్క‌ర్లు కొడుతోంది. పవిత్రా లోకేష్ పాపులర్ న‌టి అయిన‌ప్ప‌టికీ న‌రేష్ తో పెళ్లి వార్త‌లు మొద‌లయ్యాక ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది. న‌రేష్ ప‌విత్ర క‌లిసి ఉంటున్నారని చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి ప‌ది సినిమాల్లో న‌టించార‌ని ఆ స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి ప్ర‌స్తుతం డేటింగ్ లో ఉన్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

 

అలాంటి స‌మ‌యంలో విర‌ద్దరూ క‌లిసి మ‌హాబ‌లేశ్వ‌రంలో పూజ‌లు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఆ నాటి నుండి వీరి పెళ్లి వార్త‌లు మొద‌ల‌య్యాయి. న‌రేష్ ప‌విత్రా లోకేష్ నరేష్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ప‌విత్ర లోకేష్ కు వివాహం జ‌ర‌గ్గా ఇద్ద‌రు సంతానం ఉన్నారు. కానీ కొంత‌కాలంగా ప‌విత్ర లోకేష్ భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న‌ట్టు టాక్. కానీ ఇంకా విడాకులు తీసుకోలేద‌ని తెలుస్తోంది.

Also Read: ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌పై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి

Advertisement

ఇదిలా ఉండ‌గా ప‌విత్ర లోకేష్ మూడు వంద‌ల‌కు పైగా సినిమాల్లో న‌టించింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది. ఆ త‌ర‌వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా రానిస్తోంది. పవిత్ర క‌న్న‌డ న‌టి…ఆమె తండ్రి మైసూర్ లోకేష్ ప్ర‌ముఖ న‌టుడు కావడం విశేషం. మెట్రిక్యులేష్ చ‌దవి ఉన్న‌త చ‌దువులు చ‌దువుకోవాల‌నుకున్న ప‌విత్ర లోకేష్ త‌న తండ్రి మ‌ర‌ణంతో చ‌దువుకు దూరం అవ్వాల్సి వ‌చ్చింది.

Also Read: అక్క‌డ‌ పానీపూరి అమ్మ‌కాలు నిషేదం.. ఎందుకంటే..?

అంతే కాకుండా ప‌ద‌హారేళ్ల‌కే మిస్ట‌ర్ లోకేష్ అనే సినిమా ద్వారా క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమా అనుకున్నమేర విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ప్రైవేట్ జాబ్ చేస్తూ సినిమాల్లో అవ‌కాశాల‌ను వెతుక్కుంది. తాను హీరోయిన్ గానే చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికీ ఆమె ఎక్కువ హైట్ ఉండ‌టం వ‌ల్ల అవ‌కాశాలు త‌క్కువ‌గా వ‌చ్చేవ‌ట‌. ఆ కార‌ణం వ‌ల్ల‌నే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాల్సి వ‌చ్చింద‌ట‌.

Visitors Are Also Reading