Home » ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌పై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి

ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌పై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి

by Anji

తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యూకేష‌న్ ఇంట‌ర్ మొద‌టి ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in లేదా ttps://results.cgg.gov.in లేదా https://examresults.ts.nic.in వీటితో పాటు Schools9.com, manabadi.com త‌దిత‌ర వెబ్‌సైట్ ల‌లో ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల్లో బాలిక‌లు స‌త్తా చాటారు. ఇంట‌ర్ జ‌న‌ర‌ల్‌, ఒకేష‌న‌ల క‌లిపి ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో 72.33 శాతం బాలిక‌లు పాస్ అయితే.. 54.25 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. ఇక ద్వితీయ సంవ‌త్స‌రంలో 75.28 శాతం మంది బాలిక‌లు పాస్ అయితే.. 59.21 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల్లో బాలిక‌లు పైచేయి సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మార్కులు త‌క్కువ‌గా వ‌చ్చాయ‌ని భావిస్తున్న వారు అయోమ‌యంలో ప‌డ్డారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లో మార్కులు త‌క్క‌వుగా వ‌చ్చిన‌ట్ట‌యితే వారు ఇంట‌ర్ బోర్డుకు ఇలా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.


ముఖ్యంగా విద్యార్థులు Helpdesk-ie-telangana.gov.in మెయిల్ ఐడీకి ఫిర్యాదును పంప‌వ‌చ్చు. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కి కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అయితే 040-24601010 లేదా 040-24655027 నెంబ‌ర్ల‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 2500 జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో స్టూడెంట్ కౌన్సిల‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఒత్తిడి, ఆందోళ‌న‌, భ‌యానికి గురైతే వీటిని అధిగ‌మించేందుకు క్లినిక‌ల్ సైకాల‌జిస్టుల స‌హాయం తీసుకోవ‌చ్చు. ఉద‌యం 9 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సైకాల‌జిస్ట్‌లకు కాల్ చేయ‌వ‌చ్చు. డాక్ట‌ర్ మ‌జ‌ర్ అలీ 9491265299, డాక్ట‌ర్ అనిత 949129159, డాక్ట‌ర్ ర‌జినీ 9491273876, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు 9491307681, శ్రీ‌ల‌త 9491321197, శైల‌జ పిస‌పాటి 9491338909, గుత్తిమ్ దేవి 9491265503, స‌య్య‌ద్ అల్తాప్ హుస్సెన్ 9491279203, స‌రోజా 9491296096 నెంబ‌ర్ల‌తో పాటు 1800599333 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు కూడా కాల్ చేయ‌వ‌చ్చు.

Also Read : 

సినిమా అంటే తెలియని రోజుల్లోనే..లక్ష రెమ్యునరేషన్ తీసుకున్న తొలితరం సూపర్ స్టార్..?

 

Visitors Are Also Reading