Home » సినిమా రష్ చూసి అట్టర్ ఫ్లాప్ అనుకున్నారు..! తిరిగి చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ సినిమా ఏదంటే ?

సినిమా రష్ చూసి అట్టర్ ఫ్లాప్ అనుకున్నారు..! తిరిగి చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ సినిమా ఏదంటే ?

by AJAY
Ad

మ‌హేశ్ బాబు కెరీర్ లోని బెస్ట్ సినిమాల‌లో ఒక్క‌డు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో మ‌హేశ్ బాబుకు జోడీగా భూమిక చావ్లా హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు గుణ‌శేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి కానీ అప్ప‌టి వ‌ర‌కూ క‌బడ్డిని ప‌ట్టించుకున్న‌వారు లేరు. కానీ ఒక్క‌డు సినిమాతో క‌బ‌డ్డీ ఆట‌కు కూడా క్రేజ్ వ‌చ్చింది.

Advertisement

ఈ సినిమా పూర్తి ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కింది. ఈ సినిమాలో ఛార్మినార్ హైలెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో వాడుకున్న‌ట్టుగా మ‌రే సినిమాలో కూడా ఛార్మినార్ ను వాడుకోలేదు. హీరో ఛార్మినార్ పై సిగ‌రెట్ తాగ‌టం…పాట‌లు పాడుతూ స్టెప్పులు వేయ‌డం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. చాలా మంది అది నిజ‌మైన ఛార్మినార్ పై తెర‌కెక్కించార‌ని అనుకున్నారు.

Advertisement

కానీ నిజానికి ఈ సినిమా కోసం ఐదెక‌రాల్లో సెట్ వేసి చిత్రీక‌ర‌ణ పూర్తిచేశారు. ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్ న‌ట‌న మ‌రో హైలెట్ అనే చెప్పాలి. అదేవిధంగా ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం కామెడీ కూడా ఈ సినిమాకు ప్ల‌స్ గా నిలిచింది. అయితే ఈ సినిమా పూర్తయిన త‌ర‌వాత కాపీ చూసిన ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అనుమానం వ్య‌క్తం చేశారు.

okkadu phone number scene

అంతే కాకుండా కొన్ని సూచ‌న‌లు చేశారు. ఇక గుణ‌శేఖ‌ర్ ఎడిట‌ర్ కు చెప్పి మార్పులు చేర్పులు చేయించారు. 2003 లో అలా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమాను సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌హేశ్ బాబు గుణ‌శేఖ‌ర్ తో క‌లిసి మార్నింగ్ షో చూసారు. అప్పుడే ఈ సినిమా సూప‌ర్ హిట్ అని డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమా అనుకున్న‌ట్టుగానే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ALSO READ : తన పై సెటైరికల్ గా సినిమా చేసిన పృథ్వీ రాజ్ ఇంటికి వస్తే ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

Visitors Are Also Reading