Home » తన పై సెటైరికల్ గా సినిమా చేసిన పృథ్వీ రాజ్ ఇంటికి వస్తే ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

తన పై సెటైరికల్ గా సినిమా చేసిన పృథ్వీ రాజ్ ఇంటికి వస్తే ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!

by AJAY
Ad

థ‌ర్టి ఇయ‌ర్స్ పృథ్వీ ఇండ‌స్ట్రీలో ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డా అనే డైలాగ్ తో పృథ్వీరాజ్ ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఏళ్లు గ‌డిచినా ఖ‌డ్గం సినిమాతో పృథ్వీ రాజ్ కు బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర‌వాత వ‌రుస సినిమాల్లో క‌మెడియ‌న్ గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఇక ఇండ‌స్ట్రీలో న‌టుడిగా ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలో పృథ్వీరాజ్ వైసీపీలో చేరి రాజ‌కీయాల్లో చురుకుగా వ్య‌వ‌హ‌రించాడు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ తిరిగి మ‌రీ ప్ర‌చారం చేశాడు.

Advertisement

అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాన్, చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు కురిపించాడు. అయితే ప్ర‌స్తుతం వైసీపీ పై పృథ్వీరాజ్ అసంతృప్తితో ఉన్నాడు. ప‌వ‌న్, చంద్ర‌బాబుల‌పై బ‌లుపుతో నోరు పారేసుకున్నాన‌ని తాను వైసీపీలో చేరి ఓ ఉగ్ర‌వాద సంస్థ‌లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు అయ్యింద‌ని సంచ‌లన ఆరోప‌ణ‌లు చేశాడు. ఇదిలా ఉంటే పృథ్వీ ఎన్టీరామారావు కాలం నుండి ఇండ‌స్ట్రీలో ఉన్నాడు.

ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ త‌న మ‌ధ్య జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి వెల్ల‌డించాడు. ఎన్టీరామారావు సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ధ్య రాజ‌కీయంగా విభేదాలు ఉండేవ‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో కృష్ణ ఎన్టీఆర్ పై సెటైరిక‌ల్ గా సినిమాలు కూడా చేశారు. ఈ క్ర‌మంలో గండిపేట ర‌హస్యం అనే సినిమా చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాల‌న చేయ‌లేద‌ని గండిపేట‌లో విలాసవంతంగా గ‌డుపుతున్నార‌ని సెటైరిక‌ల్ గా చూపించారు.

Advertisement

అయితే ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి పృథ్వీరాజ్ ను ఎన్టీఆర్ పాత్ర‌కు ఎంపిక చేశారు. ఇక ఆ సినిమా ప్ర‌భావం త‌న కెరీర్ పై పడింద‌ని పృథ్వీరాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కృష్ణ‌గారి ఆద్వ‌ర్యంలో వ‌స్తున్న సినిమా క‌దా అని న‌టించాన‌ని తాను చేయ‌క‌పోతే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని చేశాన‌ని అన్నారు. అన్న‌గారిలాగా న‌టిస్తే మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. సినిమా విడుదలైన త‌ర‌వాత తాను నారాయ‌ణ గూడ లోని దీప‌క్ మ‌హ‌ల్ కు ద‌ర్శ‌కుడితో క‌లిసి వెళ్ల‌గా టీడీపీ కార్య‌కర్త‌లు త‌న‌పై దాడికి వ‌చ్చార‌ని చెప్పారు. కానీ హ‌రికృష్ణ‌గారు త‌న‌ను వెంట‌నే కారు ఎక్కించుకున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా కృష్ణ‌గారి ఇంటినుండి మామిడిపండ్ల‌ను ఎన్టీఆర్ ఇంటికి తీసుకువెళ్లాన‌ని చెప్పారు. ఎన్టీఆర్ ను చూడ‌గానే కాళ్ల‌పై ప‌డ్డాన‌ని అన్నారు. దాంతో ఎన్టీఆర్ మీరేనా నాలా న‌టించింది బాగుంది కానీ ఎప్పుడూ అలాంటి పాత్ర‌లే చేయ‌కు పైకి రాలేవు అని స‌ల‌హా ఇచ్చార‌ని అన్నాడు. ఎన్టీఆర్ ప‌క్క‌న ఉన్న అనుచ‌రులు త‌న‌ను కొట్ట‌డానికి చూశార‌ని కానీ ఆయ‌న వారిని బెదిరించాడ‌ని అన్నారు. ఎన్టీఆర్ చాలా గొప్ప‌వార‌ని కొనియాడారు.

AlSO READ : “ఛత్రపతి” సినిమా సూరీడు గుర్తున్నాడా…? ఇప్పుడు ఎంత మారిపోయాడో చూడండి…!

Visitors Are Also Reading