Home » భార్య భర్తలు భయం లేకుండా ఈ 1 పని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..!!

భార్య భర్తలు భయం లేకుండా ఈ 1 పని చేస్తే ధనవంతులవ్వడం ఖాయం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రపంచంలో ఉండే మనుషులందరూ ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండరు అనేది మనందరికీ తెలుసు. ఒక్కొకరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. అయితే మనిషి అనే వారు ఎలా ఉండాలో?ఎలా ఉంటే జీవితం ఆనందంగా సాఫీగా సాగుతోందో ? తెలియజేశాడు చాణిక్యుడు. ఆయన చెప్పిన ప్రతి విషయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు విషయాలు పాటిస్తే జీవితం అద్భుతమే.
#1. స్నేహ సంబంధం కలిగి ఉండాలి :

భార్యాభర్తలు ఒకరికి ఒకరు స్నేహ సంబంధం కలిగి ఉండి, సిగ్గుపడటం వదిలేయాలని అన్నారు. ఈ రెండూ వదిలేస్తే ఇద్దరూ ఏ పనిలో అయినా సన్నిహితంగా ఉంటూ, ముఖ్యంగా కలయిక విషయంలో సిగ్గులు వదిలేయాలని, భయంతో కలిస్తే మీ మనసులో విషయాలు చెప్పుకోలేరని, దీని వల్ల మూడో వ్యక్తి జోక్యం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇది భార్యాభర్తల వివాహబంధంలో మంచిది కాదని చాణిక్యుడు తెలియజేశారు.
#2. ఆహారం విషయంలో :

Advertisement

అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు మన భారతీయులు. మనం తినేది ఏదైనా సరే దాన్ని గౌరవించాలి. భోజనం చేసే సమయంలో సిగ్గు, మొహమాటం, బిడియం వంటివి ఉండకూడదు. స్నేహితులు,బంధువులు ఇలా ఎవరి ఇంటికి అయినా భోజనానికి వెళితే సిగ్గు, మొహమాటం వదిలేయాలని, లేదంటే ఆహారం సరిగా తినలేరని తెలియజేశారు చాణిక్యుడు.

Advertisement

also read:స‌రోగ‌సీ అంటే ఏంటి ? దానిని భార‌త ప్ర‌భుత్వం ఎందుకు ర‌ద్దు చేసిందో తెలుసా ?

#3. గురుశిష్యుల బంధం :

గురువు మరియు శిష్యుల మధ్య కాస్త భయం తో పాటుగా స్నేహ బంధం అనేది కలిగి ఉండాలని, అలా ఉండడం వల్ల మీకు ఎలాంటి విషయం ఎదురైనా గురువుకు చెప్పే అవకాశం ఉంటుందని, దానివల్ల ఎక్కువ నేర్చుకొని ప్రయోజకులు అవుతారని చాణిక్యుడు తెలియజేశారు.
#4. డబ్బు విషయంలో :


డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు.. స్నేహితులు కానీ బంధువుల దగ్గర కానీ డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండాలని,ఎలాంటి సిగ్గు,బిడియం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం వల్ల సమస్యలు ఉండవని చాణిక్యుడు తెలియచేసాడు.

also read:

Visitors Are Also Reading