Home » హీరో వేణు అవకాశాలు తగ్గి చివరికి అక్కడ పని చేసారా ? అయన కష్టాలు వింటుంటే బాధగా ఉంది ..!

హీరో వేణు అవకాశాలు తగ్గి చివరికి అక్కడ పని చేసారా ? అయన కష్టాలు వింటుంటే బాధగా ఉంది ..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో కొంత‌మందిని ప్రేక్ష‌కులు తెగ ఇష్ట‌ప‌డ‌తారు. అలా తెలుగు ప్రేక్ష‌కులు న‌టుడు వేణు తొట్టెంపూడిని చాలా అభిమానిస్తారు. వేణు హ‌నుమాన్ జంక్ష‌న్, పెళ్లాం ఊరెలితే, స్వ‌యంవ‌రం లాంటి సినిమాల‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానూ న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. కానీ వేణు కు సరైన బ్రేక్ మాత్రం ప‌డ‌లేదు. ఈ క్ర‌మంలో అనుకోకుండా సినిమాల‌కు దూరమయ్యాడు.

venu thottempudi

venu thottempudi

చాలా ఏళ్ల గ్యాప్ త‌ర‌వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ద‌మ్ము సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో వేణు మ‌ళ్లీ సినిమాల‌కు దూరం అయిపోయాడు. ఇక రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు రెండో సారి రీఎంట్రీ ఇచ్చాడు. కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో వేణు న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

Advertisement

Advertisement

venu thottempudi

venu thottempudi

పోలీస్ పాత్ర‌లో వేణు అద‌ర‌గొట్టాడ‌ని మళ్లీ సినిమాల‌లో బిజీ అవుతాడ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే వేణు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. తాను ఇంజ‌నీరింగ్ చేశాన‌ని కానీ ఎప్పుడూ జాబ్ చేయ‌లేద‌ని చెప్పాడు. స్వ‌యంవ‌రం సినిమా ఫ్లాప్ అయితే ఉద్యోగం రాక‌పోతే డ్రైవ‌ర్ గా అయినా ప‌నిచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు.

Actor venu wife

Actor venu wife

స్వ‌యంవ‌రం సినిమాకు ముందు త‌న వ‌ద్ద ఏమీ లేద‌ని డ్రైవింగ్ లైసెన్స్ మాత్ర‌మే ఉంద‌ని అన్నారు. అంతే కానీ ఎప్పుడూ తాను భ‌య‌ప‌డ‌లేద‌ని చెప్పారు. త‌న‌పై కుటుంబంలో ఎలాంటి ఒత్తిడి ఉండేది కాద‌ని చెప్పారు. త‌నుకు సినిమాలు అంటే పిచ్చి అని రోజూ ఖ‌చ్చితంగా ఏదో ఒక సినిమా చూసేవాడిన‌ని చెప్పారు. ఇక మొత్తానికి వేణు రీఎంట్రీ తో ఆయ‌న అభిమానులు కుషీ అవుతున్నారు.

ALSO READ :  భర్తను విడిచి 15 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయిన 30 ఏళ్ల మహిళ…. చివరికి ట్విస్ట్ ఏంటంటే…?

Visitors Are Also Reading