Home » మహేష్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ?

మహేష్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె శ్రీలీల అనే చెప్పవచ్చు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పెళ్లి సందD  చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD చిత్రంలో శ్రీలీల తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. రెండో సినిమాని మాస్ మహారాజా రవితేజతో చేసే ఛాన్స్ అందుకుంది. ఇటీవల విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయం సాధించడంతో ఈమెకి  ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. 

Advertisement

టాలీవుడ్ కుర్ర హీరోలందరూ ఇప్పుడూ ఈ బ్యూటీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లను లైనఫ్ చేసింది. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ఓ సినిమా కాగా.. మరొకటి.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా లో కూడా నటించనుందని తెలుస్తోంది. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం నుంచి అనూహ్యంగా ఇప్పుడు శ్రీలీల తప్పుకుందని ప్రచారం జరుగుతోంది.  

Advertisement

Also Read :   Adivi sesh:ఒక్క ఫ్యామిలీ నుంచి 10మంది హీరోలుంటే మాలాంటి వారికి ఛాన్సులు దక్కేదెలా అంటూ ఎమోషనల్..!

Manam News

 మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా వస్తోన్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుండగా ఆమె సిస్టర్ గా శ్రీలీలను ఎపిక చేశారట.ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్  నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా మిస్ చేసుకోవడం ఈ అమ్ముడి బ్యాడ్ లక్ అని కొందరు అంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో అన్నది తెలియాల్సి ఉంది. 

Also Read :  Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

Visitors Are Also Reading