Home » నరేష్ ముగ్గురు భార్యల గురించి నమ్మలేని నిజాలు.. అందరూ అలాంటి వారేనా..?

నరేష్ ముగ్గురు భార్యల గురించి నమ్మలేని నిజాలు.. అందరూ అలాంటి వారేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే నరేష్ తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.. తను పవిత్ర లోకేష్ ని నాలుగో వివాహం చేసుకోబోతున్నానని ప్రకటించారు. ఇప్పటికే నరేష్ మూడు వివాహాలు చేసుకుని వారితో విడిపోయాడు.. మరి నరేష్ విడిపోయిన ఆ ముగ్గురు భార్యల బ్యాగ్రౌండ్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. నరేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు పొందారు. నటనలో ఆయనను మించిన వారు లేరని చెప్పవచ్చు.

Advertisement

also read:అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాలో నటించిన NTR, బాలయ్య..కానీ విడుదలవ్వలేదు..కారణం..!!

నరేష్ సినీ కెరియర్ లో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సమయంలోనే విజయనిర్మల సినీ పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను అనే వ్యక్తి కుమార్తెతో అరేంజ్ మ్యారేజ్ చేశారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతగాడి పేరు విజయ్ కృష్ణ. ఆ వ్యక్తి రెండు మూడు సినిమాల్లో కూడా నటించారు. కానీ నరేష్ కొన్నాళ్లకు ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. దీని తర్వాత నరేష్ రెండో వివాహం ప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కొడుకు పుట్టిన తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇక నరేష్ అంతటితో ఆగకుండా ముచ్చటగా మూడో వివాహానికి కూడా సిద్ధమయ్యాడు. మూడవసారి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నయ్య కూతురు రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి నరేష్ వివాహం 50 ఏళ్లు.. ఆమె వయసు 30. ఈ జంటకు కూడా ఒక బాబు పుట్టాడు.

Advertisement

వీరి వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రమ్య ప్రవర్తన బాగాలేదని డబ్బు కోసం వేధిస్తోందని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ తరుణంలోనే నరేష్ కు పవిత్ర లోకేష్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తిరగడం స్టార్ట్ చేశారు. మొన్నటికి మొన్న నరేష్ పవిత్ర లోకేష్ ను ఒక హోటల్లో రమ్య రఘుపతి రెడ్ హండెడ్ గా పట్టుకుని చెప్పుతో కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తతంగం తర్వాత నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నానని నూతన సంవత్సరం సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఈ మధ్యనే రమ్య రఘుపతి కి విడాకుల నోటీస్ కూడా పంపించారని తెలుస్తోంది. విడాకులు మంజూరు అయితే పవిత్ర మెడలో మూడు ముళ్ళు వేసి నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు నరేష్. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

also read:

Visitors Are Also Reading