Home » అల్లు అర్జున్ ను, స్నేహ రెడ్డి అంతలా తిట్టినా బన్నీ సైలెంట్ వెనుక అసలు తప్పు ఇదేనా..?

అల్లు అర్జున్ ను, స్నేహ రెడ్డి అంతలా తిట్టినా బన్నీ సైలెంట్ వెనుక అసలు తప్పు ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలు మాత్రమే.. వీరిద్దరిది లవ్ మ్యారేజ్.. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు పేరు అల్లు అయాన్, కూతురు పేరు అల్లు అర్హ ఈ విధంగా క్యూట్ ఫ్యామిలీతో జీవితం ఆనందంగా గడిపేస్తున్నారు బన్నీ దంపతులు.. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా బన్నీ దంపతుల గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:పొరపాటున కూడా ఈ వస్తువులు రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!

అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉంటే అల్లు స్నేహారెడ్డి అతనికి తోడునీడగా కుటుంబాన్ని మరియు అల్లు అర్జున్ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది స్నేహ రెడ్డి. అంతేకాకుండా ఆమె కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. లేటెస్ట్ ట్రెండింగ్ ఫ్యాషన్ తో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్సును ఉత్సాహపరుస్తుంది. అలాంటి స్నేహారెడ్డి గురించి ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.. అదేంటయ్యా అంటే.. స్నేహ రెడ్డి మొదటిసారి తనపై తీవ్రమైన కోపానికి వచ్చిందట.. తనను తిట్టేసిందట, దీంతో అల్లు అర్జున్ కు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు..

Advertisement

అయాన్ పుట్టాక స్నేహ రెడ్డి అల్లు అర్జున్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసిందని, పిల్లల్ని పెంచడంపై దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. ఒకరోజు స్నేహ రెడ్డి బయటకు వెళ్తూ అయాన్ కి స్నానం చేయించమని చెప్పిందని, తను స్నానం చేయిస్తుండగా అయాన్ స్లిప్ అయ్యి కింద పడిపోయాడని, ఈ విషయం తెలుసుకున్న స్నేహ రెడ్డి తనపై తీవ్రంగా అరుస్తూ, విపరీతంగా తిట్టేసిందని చెప్పాడు. నీకు ఆ పని చెప్పడం నాదే బుద్ధి తక్కువ అంటూ ఫైర్ అయిందని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నానని, ఆమె తనపై ఇంత కోపానికి రావడానికి కారణం పిల్లలపై తల్లి ఎంత కేరింగ్ గా ఉంటుందో అర్థం చేసుకున్నానని అన్నారు.. ఈ విధంగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నారు బన్నీ.

also read:

Visitors Are Also Reading