Home » “బలగం” మూవీ గ్రామాల్లో ప్రదర్శిస్తే పోలీస్ కేసులు తప్పవా..?

“బలగం” మూవీ గ్రామాల్లో ప్రదర్శిస్తే పోలీస్ కేసులు తప్పవా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ ఎంతటి ఘనవిజయం అందుకొని ముందుకు పోతుందో మనందరికీ తెలుసు. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ మూవీకీ మంచి ఆదరణ లభిస్తుంది. తెలంగాణ మారుమూల గ్రామాల్లో కూడా ఈ చిత్రం గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఈ మూవీ ప్రజలకు ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రియదర్శి కావ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో తెలంగాణ యాస, భాష,సాంప్రదాయాలు అన్ని కలగలిపి పల్లెటూరి బంధాలు,బంధుత్వాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు వేణు.

also read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌

Advertisement

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించింది. చాలా గ్రామాల్లో దండోరా వేసి మరీ ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఉండే మెయిన్ సెంటర్ ల వద్ద రచ్చబండల వద్ద ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులని అమెజాన్ సంస్థ సొంతం చేసుకుంది. అమెజాన్లో మార్చి 24 నుంచి ఈ చిత్రం స్త్రీమ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తమ చిత్రాన్ని గ్రామాల్లో అక్రమంగా ఉచిత ప్రదర్శనలు చేయడం వల్ల తమకి భారీ నష్టం అంటూ దిల్ రాజు పోలీసులని ఆశ్రయించారు.

also read:టైలర్ తప్పుగా ప్రవర్తిస్తే.. పల్సర్ బైకు ఝాన్సీ తండ్రి ఏమన్నాడో తెలుసా ? 

అక్రమ ప్రదర్శనలు అడ్డుకోవాలని దిల్ రాజ్ టీం నిజాంబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బలగం చిత్రాన్ని పల్లెటూరి ప్రజలకు అక్రమంగా ప్రదర్శిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. మరి దీనిపై పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ఒక చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఇంతటి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

also read:ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?

Visitors Are Also Reading