Telugu News » Blog » రోహిత్ కు రెస్ట్ ఇవ్వడం అవసరే లేదు.. ఆతను ఏం ఆడాడు..!

రోహిత్ కు రెస్ట్ ఇవ్వడం అవసరే లేదు.. ఆతను ఏం ఆడాడు..!

by Manohar Reddy Mano
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఈ సిరీస్లో భారత జట్టుకు కె.ఎల్.రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా… వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. అయితే ఈ సిరీస్ నుండి భారత సీనియర్ ఆటగాళ్లు అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, షమీ వంటి వారికి విశ్రాంతి ఇచ్చారు బీసీసీఐ సెలెక్టర్లు. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఏకీభవించడం లేదు
తాజాగా రవి శాస్త్రి మాట్లాడుతూ… రోహిత్ శర్మ కు విశ్రాంతి అసలు అవసరం లేదని అన్నాడు. అసలు రోహిత్ శర్మ అంతగా ఏమి క్రికెట్ ఆడాడు అని ప్రశ్నించాడు. గత ఏడాది టీమిండియా వెళ్లిన ఆస్ట్రేలియా పర్యటనలో మధ్యలో జట్టుతో కలిసిన రోహిత్ శర్మ… ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. ఇలా గాయాల కారణంగా రోహిత్ చాలాసార్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. కాబట్టి అతను ఎక్కువ క్రికెట్ ఆడలేదు. అందుకే అతనికి విశ్రాంతి అవసరం లేదు అని రవిశాస్త్రి అన్నాడు. ఇక ఇదే సమయంలో కోహ్లీ గత ఏడాదిన్నరగా నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్న అతనికి విశ్రాంతి కావాల్సిందే అని చెప్పాడు
అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. అందువల్ల ప్లే ఆఫ్స్ కి వెళ్ళ లేదు. కాబట్టి సౌతాఫ్రికాతో జూన్ 9న ప్రారంభం కానున్న టి20 సిరీస్ కంటే ముందు రోహిత్ శర్మకు రెండు వారాల విరామం దొరుకుతుంది. అది అతనికి చాలా ఎక్కువ. రెండు వారాల తర్వాత అతను జట్టుతో కలిసి ఆడవచ్చు… అయినా బీసీసీఐ రోహిత్ కు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయం కాదు. ఇక ఎలాగూ కోహ్లీ ఆడుతున్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కి వెళ్లినందున కోహ్లీకి తగిన సమయం దొరకదు. అందుకే అతను విశ్రాంతి తీసుకోవడం లో తప్పులేదు అని అన్నారు రవి శాస్త్రి.
ఇవి కూడా చదవండి :