Home » ఉమ్రాన్ విజయంకు వారే కారణం : తండ్రి అబ్దుల్ రషీద్

ఉమ్రాన్ విజయంకు వారే కారణం : తండ్రి అబ్దుల్ రషీద్

by Azhar
Ad
ప్రస్తుతం ఐపీఎల్ లో ఆదరగొడుతున్న యువ ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడు. గత ఏడాది వరకు సన్ రైజర్స్ నెట్ బౌలర్ గా ఉన్న మాలిక్.. లీగ్ మధ్యలో నటరాజన్ గాయం కారణంగా జట్టులోకి వచ్చి చెలరేగాడు. తన వేగంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దాంతో ఐపీఎల్ 2022  మెగవేలం ముందు తనను హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకోగా… ఇప్పుడు ఈ సీజన్ లో దుమ్ములేపుతున్నారు.
ఇక తన కొడుకు ఐపీఎల్ లో రాణిస్తుండటంతో ఉమ్రాన్ తండ్రి ఎంతో ఆనందిస్తున్నారు. స్థానికంగా ఓ మార్కెట్ లో పండ్లు అమ్ముకునే ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ రషీద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్రాన్ కు చిన్నపటినుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తాను చాలా మొండిగా పేసర్ ను కావాలనే తడి టెన్నిస్ బంతులతో ప్రకీస్ చేసేవాడు. ఇక్కడ స్థానికంగా అప్పటినుండి ఉమ్రాన్ ఫెమస్. పిల్లల మధ్యలో జరిగే మ్యాచ్ లకు ఉమ్రాన్ ను పోటీ పడి మరి తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు భయంతో మావాడిని టోర్నీలలో ఆడనిచ్చేవారు కాదు.
కానీ ఇప్పుడు మావాడు ఇంత విజయం సాధించడానికి ముఖ్య కారణం అబ్దుల్ సమద్, ఇర్ఫాన్ పఠాన్ లు. అబ్దుల్ మా వాడి బౌలింగ్ చూసి ఇర్ఫాన్ పఠాన్ వద్దకు తీసుకెళ్లాడు. అందుకే తనకు నేను ఈరోజు ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక ఉమ్రాన్ తనబౌలింగ్ తో నన్ను కూడా ఇక్కడ కాశ్మీర్ మొత్తం ఫెమస్ చేసాడు. మార్కెట్ కు వచ్చే అందరూ నన్ను ”నువ్వు ఉమ్రాన్ తండ్రివా’ అని అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అబ్దుల్ రషీద్ పేర్కొన్నారు. అలాగే తన కొడుకు ఇంకా బాగా ఆది దేశానికి మంచి పేరు తేవాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading