Home » ఆరెంజ్ క్యాప్ పోటీ ఆ ఇద్దరికే..?

ఆరెంజ్ క్యాప్ పోటీ ఆ ఇద్దరికే..?

by Azhar
Ad

భారత మాజీ హెడ్ కోచ్.. ప్రస్తుత ఐపీఎల్ 2022 వ్యాఖ్యాత రవిశాస్త్రి గురించి అందరికి తెలిసిందే. ఎప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వార్తలో నిలుస్తుంటాడు. ఇక ప్రస్తుతం మన ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తుండటంతో.. ఈ ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు సొంతం చేసుకుంటారు అనే విషయాన్ని తెలిపాడు.

Advertisement

తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ గెలిచే ఆవకాశం ఎక్కువగా కేఎల్ రాహుల్, జొస్ బట్లర్ కు ఉంద్ అని తెలిపాడు. ఇకవేళ ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ఈ ప్రశ్న అడిగిన తాను కోహ్లీ పేరు కాకుండా రాహుల్ పేరే చెప్పేవాడిని అన్నాడు. ఎందుకంటే.. ఓపెనర్లు ఎక్కువ పరుగులు చేయడానికి ఆవకాశం ఉంటుంది.

Advertisement

అందుకే వారికే ఎక్కువగా ఆరెంజ్ క్యాపులు వస్తాయి. ప్రస్తుతం రాహుల్ సూపర్ టెక్నీక్ తో ఆడుతున్నాడు. కాబట్టి అతనికి , బట్లర్ కు మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో 7 ఇన్నింగ్స్ లు ఆడిన బట్లర్ 491 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ముందుండగా… రాహుల్ 8 ఇన్నింగ్స్ లలో 368 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి కాబట్టి ఫైనల్స్ వరకు ఈ క్యాప్ ఎవరికీ వెళ్తుంది అనేది చెప్పలేం.

ఇవి కూడా చదవండి :

నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!

రిటైర్మెంట్ తర్వాత మరో రంగంలోకి వెళ్లిన 5 క్రికెటర్లు వీరే…!

Visitors Are Also Reading