Home » అల్లరి నరేష్ “ఉగ్రం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

అల్లరి నరేష్ “ఉగ్రం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

by Bunty

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి చిత్రం ఉగ్రం. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం నాంది సూపర్ హిట్ కావడంతో ఉగ్రం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్నా హీరోయిన్గా నటిస్తున్న ఉగ్రం చిత్రానికి తూము వెంకట్ కథను అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

READ ALSO :  Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

సిద్ సినిమాటోగ్రాఫర్ వ్యవహరించారు. ఉగ్రం మూవీలో అల్లరి నరేష్ పోలీసు అధికారిగా కనిపించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ తరుణంలోనే అల్లరి నరేష్ ఉగ్రం సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రైట్స్ కోసం పలు ఓటిటి ప్లాట్ ఫారమ్ లు పోటీపడిన చివరకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట.

READ ALSO : ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

Ugram Movie: అల్లరి నరేష్‌ ఉగ్ర రూపానికి ఆడియన్స్‌ ఫిదా.. ఉగ్రం ఫుల్‌ మూవీ రివ్యూ..

ఇందుకోసం ఫ్యాన్సీ అమౌంట్ అందజేసినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అనే విషయం పైన త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, నాంది తర్వాత హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమెడల కలిసి చేస్తున్న సినిమా ఉగ్రం. గతంలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న అల్లరి నరేష్ నాంది సినిమాతో కొత్త ట్రాక్ లోకి అడుగు పెట్టారు.

READ ALSO :  జూన్‌లో “అమ‌ర‌వీరుల స్మార‌కం” ప్రారంభం..ప్రత్యేకతలు ఇవే

Visitors Are Also Reading