Ugadi 2024 Rashi Phalalu: ఉగాది రాశిఫలాలు : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఉగాది పండుగ కూడా ఒకటి. ఉగాది పండుగని హిందువులందరూ కూడా ఎంతో ఆనందంగా చక్కగా చేసుకుంటారు. ఈ పాడ్యమి నుండి కొత్త పంచాంగం కూడా వస్తుంది. అప్పటినుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం పేరుతో కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతోంది. రాబోయే నూతన తెలుగు సంవత్సరంలో గురువు, శని, రాహువు అలానే కేతువులు సంచారం చాలా ముఖ్యమైనది.
Advertisement
ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. మే ఒకటి 2024న బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఏడాదంతట ఈ రాశిలో సంచరిస్తాడు. కుంభరాశిలో ఉన్న శనిగ్రహం మార్చి 29 , 2025న మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. రాహు మీనరాశిలో కేతువు కన్యారాశిలో సంచరిస్తారు ఇక ఈ కొత్త సంవత్సరం ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉండబోతుందో చూద్దాం.
Ugadi Rashi Phalalu in Telugu 2024
మేష రాశి:
ముందుగా మేష రాశి వారి విషయానికి వస్తే మేష రాశి వాళ్లు ఉన్న అనారోగ్య సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేస్తే అవి మరింత ఎక్కువగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మంచి ఆదాయం ఉన్నా కూడా ఆర్థిక కొరత ఉంటుంది ఉద్యోగంలో మీ కింద పని చేసే కార్మిక వర్గం నుండి కూడా సహకారం లభిస్తుంది ప్రజా సేవ చేసే వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటారు. భూ వివాదాలు ప్రయత్నంతోనే ముగిసిపోతాయి ఏది ఏమైనా ఏప్రిల్ నుండి కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి.
వృషభ రాశి:
ఇక వృషభరాశి విషయానికి వస్తే శని రాహులు శుభస్థానాలలో ఉన్నారు కనుక మంచి ఫలితాలు వస్తాయి. బృహస్పతి అశుభ స్థానంలో ఉండడం వలన ఆటంకాలు ఆందోళన కలుగుతాయి. మే ప్రారంభం దాకా ఖర్చు బాగా ఎక్కువ ఉంటుంది ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు కనపడతాయి సంపాదన బాగున్న సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం అనవసరమైన విషయాల కోసం వెయిట్ చేస్తారు. హతబుద్ధి వలన కుటుంబంలో శాంతి ప్రశాంతత ఉండదు. అన్ని సమస్యలకి మౌనమే పరిష్కారం. బంధువులతో మంచి సంబంధాలు ఉండవు. ఉద్యోగంలో మీ శ్రమకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో శుభకార్యాలు జరుగుతాయి సొంత ఇల్లు ఉన్న వేరే చోట ఉండాల్సి వస్తుంది. చిన్న చిన్న పనులకి కూడా ఆశ్రమ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.
మిధున రాశి:
ఏప్రిల్ నెల ఆఖరికి కుజుడు శుభప్రదంగా ఉంటాడు రాహు మద్యస్థ ఫలితాలని ఇస్తాడు శని కుంభరాశిలో ఉండడం వలన నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఆదాయం వున్నా డబ్బుకి కొరత ఉండొచ్చు. నిదానంగా ఆరోగ్యం బాగుంటుంది. మీ నుండి సహాయం పొందిన వాళ్లు మీకు దూరంగా ఉంటారు. అనుకున్న విధంగా ప్రయాణం చేయలేక పోతారు తొందరపాటు తో ఖర్చు చేయడం వలన డబ్బు కొరత ఉంటుంది.
Ugadi rashi Phalalu – కర్కాటక రాశి :
శని మరియు రాహు గ్రహాలు అశుభ ఫలితాలని ఇస్తాయి గెలుపు కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది అనవసర ఖర్చులకోసం మానసిక ప్రశాంతత మీకు తగ్గుతుంది. ఆదాయం ఉంటుంది. కానీ కుటుంబం నుండి సహకారం ఉండదు. స్వయంకృషితోనే విజయాన్ని అందుకుంటారు. పనికి రాని పరుగు అనారోగ్యానికి మీకు దారితీస్తుంది. వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు. ఇనుము లేదా ఇతర లోహాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త.
Ugadi rashi Phalalu- సింహరాశి:
ఏప్రిల్ నెల ఆఖరికి బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తారు. శని సప్తమంలో వున్నా ఇబ్బంది ఉండదు పనులు నెమ్మదిగా సాగుతాయి రాహు కేతు గ్రహాలు అశుభ స్థానాల్లో సంచరిస్తున్నాయి. ఆవేశంగా మాట్లాడటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్త గా ఉండాలి. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. సహకారం వలన పనిలో విజయాన్ని అందుకుంటారు ఓర్పుతో మాత్రమే మీరు ప్రయత్నాలకి తగిన ఫలితాలని పొందుతారు. సీనియర్ అధికారులు అనవసరంగా చికాకు పెడుతుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
Advertisement
కన్య రాశి :
శని ఆరవ ఇంట్లో ఉన్న మంచి ఫలితం ఉంటుంది లగ్నంలో కేతువు అశుభం అయితే సప్తమంలో రాహువు శుభం కనుక ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఉన్న క్రమంగా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. సీనియర్ అధికారులతో మనిషి అనుబంధం ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఎక్కువ శ్రమ లేకుండా లక్ష్యాలని చేరుకోగలుగుతారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. మీరు అనవసరంగా తీసుకున్న నిర్ణయాలని మార్చుకుంటారు ప్రధాన పనులని చేసేటప్పుడు జాగ్రత్తగా పూర్తి చేయండి. ఇతరుల సహాయం లేకుండా మీరు ఏ పని చేయలేరు న్యాయ ప్రక్రియలో మాత్రమే సులభంగా విజయాన్ని సాధిస్తారు.
తుల రాశి :
బృహస్పతి ఏప్రిల్ చివరిదాకా సప్తమంలో సంచరిస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి మే ప్రారంభం దాకా ఆదాయం ఉంటుంది కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. మనసుకు తగిన వస్తువుల్ని కొంటూ ఉంటారు. సొంత పనులు కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మనసులోని చింతలని మర్చిపోయి వ్యాపార వ్యవహారాలలో లాభాలను పొందుతారు.
వృశ్చిక రాశి:
పిల్లల విషయంలో అనవసర గందరగోళం మీకు ఏర్పడుతుంది కొన్నిసార్లు మీ నిరీక్షణ మారిపోతూ ఉంటుంది కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి వృద్ధుల సహాయం సహకారం కొత్త జీవితానికి నాంది అవుతుంది. కుటుంబంలో సమాజంలో గౌరవం కలుగుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఆరోగ్యపరంగా క్రమంగా కోల్కుంటారు. రోజు గడిచే కొద్దీ ఉద్యోగంలో సమస్య తీరుతుంది.
ధనస్సు రాశి :
ఏప్రిల్ నెల దాకా బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం మూడవ ఇంట్లో శని బలవంతుడు అవ్వడం వలన రాహు కేతువులు మాత్రం మీకు అశుభ ఫలితాలను ఇస్తారు. ఏప్రిల్ నెల దాకా చేపట్టిన పనుల్లో విజయాన్ని అందుకుంటారు మే ఒకటవ తేదీ నుండి బృహస్పతి అశుభం ఎదురు దెబ్బలు మీకు తగులుతాయి వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలని కొంటారు. అందరితో విహారయాత్రలకు వెళ్తారు పిల్లలతో మనస్పర్ధలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరిస్తారు.
మకర రాశి:
బృహస్పతి నాలుగవ ఇంట సంచరిస్తాడు మూడవ ఇంట్లో రాహువు మంచి ఫలితాన్ని ఇస్తాడు కేతువు పనిలో నిర్దిష్ట స్థాయి ఫలితాలని అనుమతించడు గెలవాలని కోరికతో కొనసాగిస్తారు. కానీ అతి విశ్వాసం తప్పులకి దారితీస్తుంది కనుక శాంతి గా వ్యవహరించండి. అసంపూర్ణంగా ఉన్న పనులు సులభంగా పూర్తి చేయండి. ఉద్యోగంలో ఆశించినట్లు గౌరవప్రదమైన స్థితిని పొందుతారు. ఖర్చులు క్రమంగా తగ్గిపోతాయి తండ్రి ఆదాయంలో సమస్య ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి మతపరమైన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే అరుదైన అవకాశం మీకు ఉంటుంది. అజాగ్రత్త వద్దు.
కుంభరాశి:
శని మీ సొంత రాశిలో వున్నా ఎలాంటి ఇబ్బంది కలిగించదు. రాహువు ద్వితీయంలో వున్నా సమస్య ఉండదు. బృహస్పతి తృతీయ లో ఉంటాడు. మే ఒకటవ తేదీన చతుర్ధ భావంలో సంచరిస్తాడు. అందరితో ప్రేమగా నమ్మకంగా ఉంటే అన్ని కలిసి వస్తాయి. బంధువులతో అనవసరమైన వాదనలు వద్దు. ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి వ్యాపార వ్యవహారాలలో మంచి ఆదాయం ఉంటుంది. డబ్బు ఆదా చేయడంలో విఫలమవుతారు.
Also read:
- 80 ఏళ్ళ క్రితం నాటి కరెంట్ బిల్ ఇది.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
- Anupama Parameshwaran: సేమ్ అనుపమ పరమేశ్వరన్ లానే ఉన్న ఈమె ఎవరో తెలుసా..?
- శివాజి సినిమాలో ఈ అమ్మాయిలు మీకు గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా వున్నారంటే..?
మీన రాశి:
బృహస్పతి రెండవ కోణంలో చివరిదాకా సంచరిస్తుంది కనుక మీ మాటకి మంచి గౌరవం ఉంటుంది. ఆర్థిక సమస్య ఉండదు. మేలో బృహస్పతి ద్వితీయభావంలోకి ప్రవేశిస్తాడు కనుక చిన్న ఆలోచనలకు కూడా శ్రమ అవసరం. ప్రతి సమస్యకి మానసిక ఒత్తిడికి గురవుతారు. అనవసరమైన ఖర్చులు ఎదురవుతాయి కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. మీరు ఒకసారి తీసుకొని నన్ను నిర్ణయాన్ని మార్చుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో మాత్రమే విజయాన్ని సాధించొచ్చు. సోదరుడు లేదా సోదరి సహాయంతో రుణ విముక్తి పొందుతారు ప్రియమైన వారి సాయంతో పనిలో విజయాన్ని అందుకుంటారు. మీ ఫలితాలన్నీ మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు ఇంట్లోని స్త్రీల ఆరోగ్యపరంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!