Home » Uday Kiran : అత‌డు సినిమాను ఉద‌య్ కిర‌ణ్ వ‌ద్ద‌న్నాడా ? ఎందుకు !

Uday Kiran : అత‌డు సినిమాను ఉద‌య్ కిర‌ణ్ వ‌ద్ద‌న్నాడా ? ఎందుకు !

by Bunty
Ad

టాలీవుడ్ అలనాటి హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో ఉదయ్ కిరణ్ చేసిన ప్రతి సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. దీంతో మెగాస్టార్ తరహాలోనే… అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిపోయిన పేరు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయ్ కిరణ్ మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.

Uday Kiran rejects athadu movie

Uday Kiran rejects athadu movie

కానీ ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ను ఎవరు మర్చిపోలేకపోతున్నారు. అతని మరణం వెనుక రహస్యం ఉందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది. అయితే మొట్టమొదట ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు సినిమా వచ్చింది.

Advertisement

Advertisement

ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పట్లో ఈ సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ అతడు సినిమా టీవీలో వస్తే చాలామంది ఎగబడి చూస్తారు. అయితే ఇంతటి బంపర్ విజయాన్ని అందుకున్న అతడు సినిమాలో మొట్టమొదటగా ఉదయ్ కిరణ్ ను హీరో చేయాలని అనుకున్నారట. అయితే ఉదయ్ కిరణ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో… ఈ సినిమా మహేష్ బాబు వద్దకు వెళ్లిందట. ఈ విషయాన్ని అతడు నిర్మాతలలో ఒకడైన మురళీమోహన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading