ఓ వైపు భర్త వదిలేశాడు. మరొక వైపు ఇల్లు పోయింది. ఇద్దరి కొడుకుని ఇంట్లో నుండి పంపించేసిన తులసికి ఉన్న ఒక్క ఆధారం కూడా పోయినది. ఫ్యాక్టరీ కూడా మూతపడడంతో తులసి కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. 24 గంటల్లోపు ఫ్యాక్టరీ తెరిపిస్తానని శపతం చేసిన తులసి ఆలోచిస్తూ బాధపడుతుంది. తులసి కష్టాల్లో ఉంటే.. ఏదైనా శపథం చేసిందంటే.. ఓ గెస్ట్ క్యారెక్టర్ వచ్చి తులసిని ఆ సమస్యల నుండి గట్టెక్కిస్తుంటారు. గతంలో రోహిత్, జీకే లాంటి వాళ్లు ఇలా వచ్చిన వాళ్లే..కాకపోతే ఈసారి ప్రవళిక వంతు వచ్చింది. వచ్చి తులసి తలపై మొట్టికాయ వేయగానే.. ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు ప్రవల్లిక అని తులసి గుర్తుపడుతుంది.
ఇక నన్ను గుర్తు పట్టలేదు కానీ.. నా మొట్టికాయని గుర్తుకున్నావా..? అని ప్రవలిక అంటే.. నీ మొట్టికాయని ఎలా మరిచిపోతానే నువ్వు వేసిన మొట్టికాయలకు నా తల వాచిపోయేది. దాదాపు పాతికేళ్లు అవుతుందే నిన్ను చూసి అని తులసి అనడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయానా..? అని ప్రవలిక పేర్కొంటుంది. ఇద్దరూ కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. అమాయకంగా మల్లెతీగలా ఉండే ఆ తులసే నాకు కనిపిస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ ఒక్కటే తేడా.. మొహంలో అమాయకత్వం బదులు ప్రపంచాన్ని మోస్తున్నంత భారం కనిపిస్తుంది. ఏమైంది అని ప్రవలిక అడుగుతుంది. తులసి అదేమి లేదంటుంది. పెళ్లి అయిత చాలు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు పాత వాళ్లను పక్కన పెట్టేస్తారు. అందరితో పాటు నిన్నూ తిడుతున్నా అని ప్రవలిక పేర్కొంటుంది.
Advertisement
సరేలే కలిసావ్ కదా వదిలిపెట్టను.. ఇప్పడు నీ గురించి చెప్పు.. ఎక్కడ ఉంటున్నావు.. ఏమి చేస్తున్నావని అడుగుతుంది. అక్కడ, ఇక్కడ అని కాదు.. ఎవరికి అవసరం ఉంటే అక్కడ ఉంటా ఐయామ్ లేడీ కృష్ణా అని ప్రవలిక అంటుంది. ఆ మాటతో తులసి ఇప్పుడు నేను నిన్ను తలచుకోలేదే ఎందుకు ప్రత్యక్షం అయ్యావు అంటుంది తులసి. తపస్సు చేస్తే ప్రత్యక్షం అయ్యేవాడు దేవుడు.. అవసరం ఎంటో తెలుసుకుని ప్రత్యక్ష్యం అయ్యేదే ప్రవలిక అని పేపర్స్ తీసి తులసి చేతిలో పెడుతుంది. అందులో ఆర్డర్ కాపీస్ చూడని చెబుతుంది ప్రవలిక. ఇక తులసి ఆ పేపర్స్‌లో ఏముందా అని చూస్తుంది. ఆర్డర్ కాపీ చూసి అవాక్కవుతుంది. అన్యాయంగా నీ ఫ్యాక్టరీని సీజ్ చేసారని.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశావు కదా.. నీ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసుకోవచ్చు అని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది అని ప్రవలిక చెబుతుది.
ఆ ఆర్టర్స్ కాపీలను చూడగానే తులసి ఎమోషనల్ ఫీలవుతుంది. గుండెల్లో భారం దింపేసావ్ ప్రవలిక నా ప్రాబ్లమ్ గురించి నీకెలా తెలుసు.. ఇలా ఎలా తెచ్చావని.. నువ్వు ఏమైనా కలెక్టర్ ఆఫీస్‌లో పని చేస్తున్నావా అని అడుగుతుంది. దాంతో ప్రవలిక అలాగే అనుకో నువ్వున్యాయంగా నీ వాళ్ల కోసం నిలబడ్డావు.. రిజల్ట్ వచ్చిందంటూ మళ్లీ వస్తానని బయలుదేరుతుంది ప్రవలిక. నీలో మార్పు చూసే వరకు ఉంటానని వెళ్తుంది. ఈ క్యారెక్టర్ అవసరం ఉన్నప్పుడు కంటిన్యూ అవుతుందన్నమాట.
Advertisement
ఇక ఫ్యాక్టరీకి ఓపెన్ చేయడానికి ఆర్డర్స్ కాపీస్ వచ్చాయని తెగ సంతోషపడిపోతుంది తులసి. ఇక లాస్యకు మ్యాటర్ తెలియడంతో ఇది ఎలా సాధ్యమని.. ఎవరిచ్చారని.. ఎందుకు ఇచ్చారని రగలిపోతుండగానే.. హాల్‌లో భాగ్య అనుభవించు రాజా అనే సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది. లాస్య కోపంతో ఊగిపోతూ.. భాగ్య చేతిలో ఉన్న ఫోన్‌ను నేలకేసి కొడుతుంది. ఏమైంది లాస్య అని భాగ్య అడగగా.. తులసి ఫ్యాక్టరీ ఓపెన్ చేసారట. నువ్వు నిజంగానే ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించావా..? లేక నాటకాలు ఆడుతున్నవా..? అని అడుగుతుంది. ఇంతలో భాగ్య ఫోన్‌లో అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి అనే సాంగ్ ప్లే కావడంతో లాస్య ఆవేశం కట్టలు తెంచుకుని ఆ ఫోన్‌ని కింద వేసి తొక్కిపడేస్తుంది.
నాకు ఎంత అవమానం జరిగిందో చూసావ్ కదా.. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కాకూడదు.. కలెక్టర్ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయించుకుని అంటుంది. అది అంత ఈజీ కాదు లాస్య.. టైం చూసి దెబ్బ కొట్టాలని అంటుంది భాగ్య. మరొకవైపు తులసి ఫ్యాక్టరీ ఆర్డర్స్ పట్టుకుని వెళ్లి.. వర్కర్స్ అందరినీ కింద కూర్చొబెట్టి మరీ చప్పట్లు కొట్టించుకుంటుంది. మీకు మాట ఇచ్చినట్టుగా ఫ్యాక్టరీని ఓపెన్ చేయించా అని అంటుంది. ఇక పక్కనే ఉన్న ఫ్యాక్టరీ పాత ఓనర్ నాకు తెలుసు తులసి.. నువ్వు అన్నావు అంటే సాధిస్తావు.. నీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలో కుట్టు మిషన్లు పరుగులు పెట్టాలని పేర్కొంటాడు.
అవును పురుగులు పెట్టాలి.. కానీ ఈ తులసి తోడు లేకుండా..? అని అంటుంది. ఆ మాటతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి గురవుతారు. నన్ను నమ్మి ఈ ఫ్యాక్టరీని నా చేతుల్లో పెట్టారు. నా వల్ల ఫ్యాక్టరీ మూసేసే పరిస్థితి వకచ్చింది. కచ్చితంగా నా శత్రువుల పనే.. మరొకసారి ఇలా జరగదని గ్యారెంటీ ఏమి లేదు. నా కారణంగా మీరందరూ నష్టపోకూడదు అని.. సమస్య నా వల్లనే అందుకే.. ఫ్యాక్టరీతో సంబంధాలు తెంచుకుని దూరంగా ఉండాలని అనుకుంటున్నా అని పేర్కొంటుంది. అక్కడ ఉన్న వర్కర్స్ అంత మాట అనొద్దు మేడమ్ మీరు లేని ఫ్యాక్టరీ దేవుడు లేని గుడి లాంటిది.. మీరు మాకు అండగా ఉంటే చాలమ్మా.. ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటామంటూ డైలాగ్‌లు పేల్చుతారు.
నా మీద మీకు ఏమైనా గౌరవం ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించండి. నా వల్ల మీరు సమస్యల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదంటూ ఫ్యాక్టరీ ఆర్డర్స్‌ను ఆ ఫ్యాక్టరీ ఓనర్ చేతిలో పెట్టి వెళ్లొస్తా.. బాబాయ్ అని తులసి చెబుతుంది. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించిన తులసి ఆ ఫ్యాక్టరీ బాధ్యతల నుండి తప్పుకుని బయటికి వచ్చేసింది. ప్రేమ్ పాటను ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొట్టేసి తాను రాసినట్టుగా నిర్మాత దగ్గర డబ్బులు నొక్కేస్తాడు. వాస్తవం తెలుసుకున్న ప్రేమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ను నిలదీసి ఎమోషనల్ అవుతాడు. రేపటి ఎపిసోడ్‌లో పరందామయ్య, అనసూయ, దివ్యలు మాట్లాడిన మాటలకు కళ్లు తిరిగి కింద పడిపోతుంది. అవసరముంటే వచ్చేస్తానని ముందే చెప్పిన ప్రవలిక సీన్‌లోకి ఎంట్రి ఇవ్వడం.. ఆ తరువాత ఏమైందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Also Read :
చిరంజీవిని తిట్టిన గూండాలు…వెంటనే పవన్ కల్యాణ్ వెళ్లి ఏం చేశాడో తెలుసా..!
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!